News April 26, 2024
సొంతగూటికి చేరుకున్న ఖమ్మం జిల్లా నేతలు

హైదరాబాద్ గాంధీభవన్లో శుక్రవారం ఖమ్మం, కొత్తగూడెం నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కొత్తగూడెం నుండి ఎడవల్లి కృష్ణ, సత్తుపల్లి నుండి సంభాని చంద్రశేఖర్, రామచంద్రనాయక్, కామేపల్లి జడ్పీటీసీ బాణోత్ ప్రవీణ్ కుమార్ నాయక్ హస్తం గూటికి చేరారు. ఈ సందర్భంగా చేరికల కమిటీ చైర్మన్ జగ్గారెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరు అసెంబ్లీ ఎలక్షన్ ముందు కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరారు.
Similar News
News November 11, 2025
ఖమ్మం జిల్లాలో 441 ఇందిరమ్మ ఇళ్లకు సమస్య

ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు నిలిచిపోవడంతో ఖమ్మం జిల్లాలో 441 మంది లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 52 మందికి నాలుగు చక్రాల వాహనాలు ఉన్నాయని, 260 మందికి గతంలో ఇల్లు మంజూరైందని అధికారులు బిల్లులు నిలిపివేశారు. మరో 129 ఇళ్లు బేస్మెంట్ పూర్తి కాగా అధికారులు పరిశీలించాల్సి ఉంది. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
News November 11, 2025
అందెశ్రీకి మన ఖమ్మంతో ప్రత్యేక అనుబంధం

ప్రముఖ రచయిత అందెశ్రీ నిన్న మరణించిన సంగతి తెలిసిందే. అయితే అందెశ్రీకి మన ఖమ్మంతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన నెలనెల వెన్నెల 65వ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాయమైపోతున్న మనిషి విలువల గురించి చేసిన ప్రసంగం, పాడిన పాటను పలువురు నెమరేసుకున్నారు. అందెశ్రీ మృతికి నెలనెల వెన్నెల నిర్వాహకులు సంతాపం తెలిపారు. అందెశ్రీ ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నామన్నారు.
News November 11, 2025
ఖమ్మంలో కొత్త రేషన్ కార్డుల జోరు

పేదలకు ఆహార భద్రత కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీని వేగవంతం చేసింది. జనవరి నాటి 4,11,143 కార్డులకు అదనంగా 52,406 కొత్త కార్డులు మంజూరయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కార్డుల సంఖ్య 4,63,549కి చేరింది. ఏప్రిల్ 1 నుంచి ఉచిత సన్న బియ్యం పంపిణీ జరగడంతో కొత్తగా లబ్ధి పొందుతున్న వారికి ఉపశమనం లభించింది.


