News January 20, 2026

జపాన్ వినూత్న పద్ధతి.. రైతును గౌరవించేలా!

image

జపాన్‌లో కూరగాయలు, పండ్ల ప్యాకెట్లపై వాటిని పండించిన రైతు ఫొటోను ముద్రిస్తారు. దీనిని ‘కావో నో మియెరు యసాయి’ అంటారు. 1970లో ప్రారంభమైన ఈ విధానం వల్ల తాము తినే ఆహారం ఎవరి కష్టం ద్వారా వచ్చిందో వినియోగదారులకు తెలుస్తుంది. ఇది రైతు శ్రమకు గుర్తింపునివ్వడమే కాకుండా కస్టమర్లలో నమ్మకాన్ని పెంచుతుంది. దీని వల్ల రైతుకు, కొనే వ్యక్తికి మధ్య ఒక అనుబంధం ఏర్పడుతుంది. ఇలాంటి విధానం మన దగ్గరా ఉండాలా? COMMENT

Similar News

News February 19, 2026

గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్: రాఘవేంద్రరావు స్థానంలో భరద్వాజ

image

TG: తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 జ్యూరీ కమిటీలో ప్రభుత్వం కీలక మార్పు చేసింది. స్పెషల్ అవార్డ్స్ జ్యూరీ ఛైర్మన్‌గా తమ్మారెడ్డి భరద్వాజను నియమిస్తూ తాజాగా ఆదేశాలు జారీచేసింది. దర్శకుడు రాఘవేంద్ర రావు స్థానంలో తమ్మారెడ్డి భరద్వాజకు బాధ్యతలు అప్పగించింది. ఈమేరకు సినిమాటోగ్రఫీ శాఖ ఉత్తర్వులు జారీచేసింది.

News February 19, 2026

చైనా అద్భుతం.. స్టెమ్‌ సెల్ థెరపీతో డయాబెటిస్ నయం

image

చైనా సైంటిస్టులు అద్భుతం చేశారు. స్టెమ్‌ సెల్ థెరపీతో ప్రపంచంలోనే తొలిసారిగా టైప్-2 డయాబెటిస్‌ వ్యాధిని నయం చేశారు. ఆరోగ్యకరమైన ప్యాంక్రియాటిక్ కణాలను మార్పిడి చేసి శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించుకునేలా చేశారు. ఈ చికిత్స విజయవంతమైంది. ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే రోగి ఇన్సులిన్ ఇంజెక్షన్లపై ఆధారపడాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే.

News February 19, 2026

డయాబెటిస్ రోగుల్లో స్టెమ్‌ సెల్ థెరపీ ఎలా పనిచేస్తుంది?

image

తొలుత డయాబెటిస్ రోగి లేదా దాత నుంచి స్టెమ్ సెల్స్‌ను తీసుకుంటారు. ల్యాబ్‌లో ప్రత్యేక రసాయనాలు, జెనెటిక్ విధానాల ద్వారా ప్యాంక్రియాటిక్(ఇవి జీర్ణక్రియకు అవసరమైన ఎంజైమ్‌లను, చక్కెర స్థాయులను నియంత్రించే హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి) కణాలను రూపొందిస్తారు. ఇవి ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే స్థాయికి చేరగానే రోగి శరీరంలోకి మార్పిడి చేస్తారు. బాడీ వాటిని స్వీకరించే దానిని బట్టి సక్సెస్ రేటు ఉంటుంది.