News January 20, 2026
సిరిసిల్ల: జిల్లా విద్యాశాఖ అధికారిగా జగన్మోహన్ రెడ్డి

సిరిసిల్ల జిల్లా విద్యాశాఖ అధికారిగా జగన్మోహన్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థలో లెక్చరర్‌గా పని చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి జిల్లా విద్యాశాఖ అధికారిగా పూర్తి బాధ్యతలు అప్పగించారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Similar News
News January 27, 2026
మోగిన నగారా.. MBNRలో 1,97,841 ఓట్లు

మున్సిపల్ కార్పొరేషన్ <<18974641>>ఎన్నికలకు నోటిఫికేషన్<<>> విడుదలైంది. మహబూబ్ నగర్ కార్పొరేషన్లో 60 డివిజన్లలో 1,97,841 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుష ఓటర్లు 96184 మంది ఉండగా మహిళా ఓటర్లు కూడా ఇంచుమించుగా అదే సంఖ్యలో ఉన్నారు. ఈ కార్పొరేషన్ పీఠం బీసీ మహిళకు రిజర్వ్ కావడం తెలిసిందే. ఇక ఫిబ్రవరి 11న ఎన్నికలు, 13న ఫలితాలు వెలువడనున్నాయి.
News January 27, 2026
సిరిసిల్ల: మోగిన ఎన్నికల నగారా.. రాజకీయ కోలాహలం

మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో సిరిసిల్ల జిల్లాలో రాజకీయ సందడి మొదలైంది. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో 67 వార్డుల్లో 1,22,836 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో 59,522 మంది పురుషులు, 63,290 మంది మహిళలు, 24 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. సిరిసిల్ల మున్సిపల్ ఛైర్ పర్సన్ స్థానాన్ని జనరల్ మహిళకు, వేములవాడ ఛైర్మన్ స్థానాన్ని బీసీ జనరల్‌కు కేటాయించారు.
News January 27, 2026
పద్మశ్రీ గ్రహీతపై కాంగ్రెస్ విమర్శలు.. శ్రీధర్ వెంబు కౌంటర్

పద్మశ్రీకి ఎంపికైన IIT మద్రాస్ డైరెక్టర్ ప్రొ.కామకోటిపై కేరళ కాంగ్రెస్ విమర్శలకు జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు కౌంటర్ ఇచ్చారు. ‘మైక్రో ప్రాసెసర్ డిజైన్‌పై కామకోటి పని చేస్తున్నారు. ఆయన అవార్డుకు అర్హులు. ఆవు పేడ, మూత్రంలో విలువైన మైక్రోబయోమ్‌లు ఉన్నాయి. ఇవి రీసెర్చ్‌కు పనికిరావనే బానిస మనస్తత్వం మనది’ అని విమర్శించారు. గోమూత్రాన్ని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లారని కామకోటిని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది.


