News January 20, 2026
ఏలూరు: వెబ్‌సైట్‌లో అభ్యర్థుల మెరిట్ లిస్టు

ఏలూరు జిల్లాలోని కుక్కునూరు, వేలేరులోని కస్తూరిబా బాలికల విద్యాలయాల్లో బోధ నేతర సిబ్బందికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్ లిస్టును https:///www.deoeluru.org వెబ్‌సైట్‌లో పొందుపరచడం జరిగిందని ఏపీసీ పంకజ్ కుమార్ మంగళవారం తెలిపారు. అభ్యంతరాలు ఉంటే ఈనెల 22లోగా రాతపూర్వకంగా సర్వ శిక్ష జిల్లా ప్రాజెక్ట్ కార్యాలయానికి పంపాలన్నారు. ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికే దళారుల మాటలు నమ్మవద్దని హెచ్చరించారు.
Similar News
News January 28, 2026
గన్నవరం ఎయిర్‌పోర్టు టెండర్లకు అనాసక్తి!

గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ పనులు సందిగ్ధంలో పడ్డాయి. 80% పనులు పూర్తయిన తర్వాత నిలిచిపోయిన మిగిలిన పనుల కోసం పిలిచిన టెండర్లకు ఒక్కరూ ముందుకు రాలేదు. EPC విధానంపై గుత్తేదారులు ఆసక్తి చూపకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. సుమారు రూ.110 కోట్ల విలువైన పనుల కోసం టెండర్ విధానంలో మార్పులు చేసి, మరో 3,4 రోజుల్లో మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
News January 28, 2026
ఎఫ్‌ఎల్‌ఎన్ అమలుపై కలెక్టర్ డీకే బాలాజీ సమీక్ష

ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న Foundational Literacy & Numeracy కార్యక్రమంపై కలెక్టర్ డీకే బాలాజీ ప్రత్యేక దృష్టి సారించారు. కార్యక్రమంలో భాగంగా ఆయన కృష్ణా జిల్లాలోని వడ్లమన్నాడు జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించారు. ఈ తనిఖీలలో భాగంగా 10th విద్యార్థులకు అమలవుతున్న 100 డేస్ యాక్షన్ ప్లాన్ పరిశీలించారు.
News January 28, 2026
15% వృద్ధి లక్ష్యం: కలెక్టర్ మహేశ్

స్వర్ణాంధ్ర లక్ష్యంలో భాగంగా కొబ్బరి అనుబంధ పరిశ్రమల ద్వారా ఏటా 15 శాతం వృద్ధి సాధించాలని కలెక్టర్ మహేశ్ కుమార్ అధికారులకు సూచించారు. బుధవారం అమలాపురం కలెక్టరేట్‌లో ఉద్యానవన, మార్కెటింగ్ శాఖలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఒకే జిల్లా–ఒకే ఉత్పత్తి విధానం ద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, విలువ ఆధారిత ఉత్పత్తులతో సాగుదారుల ఆదాయం పెంచాలని కలెక్టర్ సూచించారు.


