News January 20, 2026

హోసూర్ ఎయిర్ పోర్టు: CBNపై TNలో వార్తలు

image

కృష్ణగిరి(D) హోసూరు(TN) ఎయిర్ పోర్టుకు అనుమతి రాకపోవడం వెనుక CBN హస్తముందని కొన్ని తమిళ పత్రికల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. విమానయాన మంత్రి రామ్మోహన్ TDP కావడమే దీనికి కారణమని విశ్లేషిస్తున్నాయి. అక్కడికి దగ్గరలోని తన నియోజకవర్గం కుప్పంలో CBN ఎయిర్ పోర్టు ఏర్పాటు చేయడాన్ని గుర్తుచేస్తున్నాయి. అయితే బెంగళూరు ఎయిర్ పోర్టు, HALకు దగ్గరలో ఉన్నందున హోసూరు ఎయిర్ పోర్టుకు కేంద్రం అనుమతివ్వడం లేదు.

Similar News

News February 7, 2026

నా కొడుకును అప్పటివరకు పెద్ద క్రికెటర్‌గా భావించను: వైభవ్ తండ్రి

image

అండర్-19 WC ఫైనల్లో తన కుమారుడి ఆట చూసి గర్వంగా ఉందని వైభవ్ సూర్యవంశీ తండ్రి సంజీవ్ తెలిపారు. అతడితో పాటు మిగిలిన అందరు ఆటగాళ్లు అద్భుతంగా ఆడారని ప్రశంసించారు. అయితే వైభవ్ టెస్టులు ఆడనంత వరకు అతడిని పెద్ద క్రికెటర్‌గా చూడనని చెప్పారు. ఇది ఆరంభం మాత్రమేనని, భవిష్యత్‌లో సాధించాల్సింది ఎంతో ఉందని పేర్కొన్నారు. వైభవ్ వల్ల బిహార్‌లో చాలా మంది పిల్లలు క్రికెట్ వైపు వచ్చే అవకాశం ఉందన్నారు.

News February 7, 2026

డెలివరీ తర్వాత కాళ్ల వాపులు తగ్గట్లేదా?

image

డెలివరీ తర్వాత మహిళల్లో చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. వాటిల్లో ఒకటి కాళ్లవాపు. ప్రెగ్నెన్సీలో కాళ్లవాపు సహజమే కానీ డెలివరీ తర్వాత కూడా అలా ఉంటే జాగ్రత్త పడాలంటున్నారు నిపుణులు. కాళ్లు ఎత్తులో పెట్టుకొని పడుకోవడం, మసాజ్ చేయడం, సాల్ట్ ఎక్కువగా తీసుకోవడం, ఎక్కువసేపు ఒకే పొజిషన్‌లో ఉండటం వల్ల ఇలా జరుగుతుంది. దీన్ని నివారించడానికి ప్రొటీన్లు, పొటాషియం ఉన్న ఆహారాలు డైట్‌లో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.

News February 7, 2026

మసీదుపై దాడి.. అసలేంటీ ఇస్లామిక్ స్టేట్?

image

పాక్‌లో చేసిన <<19073745>>దాడి<<>>తో మరోసారి ఇస్లామిక్ స్టేట్(ISIS) పేరు చర్చనీయాంశమవుతోంది. 2014-2017 మధ్య సిరియా, ఇరాక్‌లో అతి దారుణమైన దాడులతో ప్రపంచాన్ని భయపెట్టిందీ సంస్థ. కానీ US దాడులు, దాని చీఫ్ అబు బకర్ బగ్దాదీ హతమవడంతో పతనమైంది. ప్రస్తుతం సిరియా, ఇరాక్, అఫ్గాన్, పాక్‌తోపాటు పలు దేశాల్లో ఉనికిలో ఉంది. దీని నాయకత్వం రహస్యంగా ఉంది. తరచూ దాడులు చేస్తోంది. ఇటీవల <<18561798>>సిడ్నీలో దాడి<<>> చేసింది కూడా IS సానుభూతిపరులే.