News January 20, 2026
గ్రీన్‌లాండ్ టెన్షన్.. కుదేలైన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాలు చవిచూశాయి. ఒక్క రోజులోనే రూ.9 లక్షల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. నిఫ్టీ 353 పాయింట్లకుపైగా పడిపోయి 25,232 వద్ద ముగియగా, సెన్సెక్స్ 1065 పాయింట్లకు పైగా నష్టపోయి 3 నెలల కనిష్ఠమైన 82,180కి చేరింది. గ్రీన్‌లాండ్‌పై US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు, టారిఫ్‌ల బెదిరింపులతో ఇన్వెస్టర్లు ఆందోళనకు గురయ్యారు. దీంతో అన్ని రంగాలు నష్టాల్లోనే ట్రేడయ్యాయి.
Similar News
News April 11, 2026
మాజీ సీఎం నాదెండ్ల ఆరోగ్యం విషమం?

ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు సమాచారం. 90 ఏళ్ల వయస్సున్న ఆయన వృద్ధాప్య సమస్యలతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. మల్టీపుల్ ఆర్గాన్స్ దెబ్బతినడం, డయాలసిస్ కారణంగా పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. వైద్యులు ఆయనను ఐసీయూలో ఉంచి పర్యవేక్షిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
News April 11, 2026
అమెరికా-ఇరాన్ చర్చలు ప్రారంభం

ఇస్లామాబాద్ వేదికగా పశ్చిమాసియా యుద్ధంపై అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. ఇరాన్ తరఫున విదేశాంగ మంత్రి అరాఘ్చీ, పార్లమెంట్ స్పీకర్ బఘేర్ ఆధ్వర్యంలోని బృందం.. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బృందం వేర్వేరుగా పాకిస్థాన్ ప్రధాని షరీఫ్‌తో భేటీ అయ్యాయి. మరికాసేపట్లో ఇరు బృందాలు ఫేస్ టు ఫేస్ చర్చలు జరపనున్నాయి. ఇరాన్ 10 పాయింట్ల డిమాండ్‌పైనే ప్రధానంగా చర్చలు సాగనున్నాయి.
News April 11, 2026
పొట్టపై నల్లటి గీత ఉంటే అబ్బాయి పుడతారా?

గర్భధారణ సమయంలో పొట్టపై కనిపించే నల్లటి గీతను ‘లీనియా నిగ్రా’ అంటారు. ఈ గీత ఉంటే అబ్బాయి పుడతారని చాలామంది నమ్ముతారు. కానీ ఇది అపోహ మాత్రమేనని వైద్యులు చెబుతున్నారు. ‘శరీరంలో ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్ల మార్పుల వల్ల మెలనిన్ ఉత్పత్తి పెరిగి చర్మం ఇలా నల్లగా మారుతుంది. ఇది ఆరోగ్యానికి ఎలాంటి హాని చేయదు. ప్రసవం తర్వాత హార్మోన్లు సాధారణ స్థితికి రాగానే ఈ గీత దానంతట అదే మాయమవుతుంది’ అని సూచిస్తున్నారు.


