News January 20, 2026
బాస్ ఈజ్ బ్యాక్.. MSVPGపై బన్నీ ప్రశంసలు!

మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రంపై అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు. ‘బాస్ ఈజ్ బ్యాక్.. స్క్రీన్‌పై వింటేజ్ వైబ్స్ చూడటం ఆనందంగా ఉంది. వెంకటేశ్ నటన, అనిల్ డైరెక్షన్, నయన్- కేథరిన్ పర్ఫార్మెన్స్ అదుర్స్. ఇది బ్లాక్ బస్టర్ కాదు.. బాస్-బస్టర్. నిర్మాత సుస్మిత కొణిదెల, సాంకేతిక బృందానికి శుభాకాంక్షలు. సంక్రాంతికి రావడం.. హిట్ కొట్టడం అనిల్‌కు ఆనవాయితీగా మారింది’ అని పేర్కొన్నారు.
Similar News
News February 4, 2026
బ్యాట్ పట్టుకోవడం రానివారు క్రికెట్ సంఘాలను నడుపుతారా?: సుప్రీం కోర్టు

క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కనీసం బ్యాట్ పట్టుకోవడం కూడా తెలియని వారు సంఘాలను నడపడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. క్రీడాకారులే సంఘాలను నిర్వహించాలని స్పష్టం చేసింది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్(MCA) ఎన్నికల స్టే ఎత్తివేతను నిరాకరిస్తూ అభ్యంతరాల కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించాలంది. క్రీడల్లో రాజకీయ జోక్యం కంటే నైపుణ్యం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వాలని అభిప్రాయపడింది.
News February 4, 2026
మున్సిపల్ ఎన్నికలు.. ఆ రెండు రోజులు సెలవు?

TG: రాష్ట్రంలోని ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలలో ఈ నెల 11న పోలింగ్ జరగనుంది. దీంతో ఎన్నికలు జరగనున్న ఆయా ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవు ఉండే అవకాశం ఉంది. ఓటు వేసేందుకు వీలుగా అక్కడి కంపెనీల్లోని ఉద్యోగులు, సిబ్బందికి కూడా హాలిడే ఇచ్చే ఛాన్స్ ఉంది. అలాగే కౌంటింగ్ జరిగే 13న కూడా సెలవు ఉంటుందని సమాచారం. దీనిపై ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
News February 4, 2026
హెలికాప్టర్ల తయారీ రంగంలోకి అదానీ గ్రూప్

భారత ప్రముఖ వ్యాపార సంస్థ అదానీ గ్రూప్ హెలికాప్టర్ల తయారీ రంగంలోకి అడుగు పెట్టింది. ఇటలీకి చెందిన ప్రఖ్యాత హెలికాప్టర్ల తయారీ సంస్థ లియోనార్డ్‌తో అదానీ గ్రూప్ జతకట్టింది. దేశీయంగా హెలికాప్టర్ల తయారీ ఎకోసిస్టం ఏర్పాటుకు సంబంధించి అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, లియోనార్డ్ కంపెనీల ప్రతినిధులు ఒప్పందం చేసుకున్నారు. భారత సైన్యం, వైమానిక దళాల అవసరాలను తీర్చడమే ఈ డీల్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.


