News January 20, 2026
తనిఖీల్లేవ్.. చర్యల్లేవ్.. అంతా సవ్యమేనా?

కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాల్లోని పలు హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయి. వాణిజ్య అవసరాలకు వాడాల్సిన కమర్షియల్ సిలిండర్లకు బదులుగా, తక్కువ ధరకు లభించే గృహ వినియోగ సిలిండర్లను వినియోగిస్తున్నారు. అధికారులు మామూళ్ల మత్తులో మునిగిపోయి కనీసం తనిఖీలు చేయడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఆకస్మిక దాడులు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Similar News
News April 3, 2026
పీడీఎస్ సేవలు పారదర్శకంగా ఉండాలి: నిత్యానంద్

టేక్మాల్: రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా పౌరసరఫరాల అధికారి నిత్యానంద్ హెచ్చరించారు. వెలుపుగొండ రేషన్ షాపును ఆకస్మికంగా తనిఖీ చేయగా 36.32 క్వింటాళ్ల బియ్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో డీలర్ దినకర్‌పై 6-ఏ నిబంధన కింద కేసు నమోదు చేశారు. నిబంధనల ప్రకారం పారదర్శక సేవలు అందించాలని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
News April 3, 2026
నెల్లూరు KGBVల్లో ప్రవేశాలకు గడువు పొడిగింపు

నెల్లూరు జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో ప్రవేశాలకు సంబంధించిన గడువును ఈనెల 10వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా సమగ్రశిక్ష అసిస్టెంట్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ వెంకటసుబ్బయ్య ఓ ప్రకటనలో తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి 6, 11వ తరగతుల్లో, 7 నుంచి పది, 12వ తరగతుల్లో మిగిలిన సీట్ల కోసం ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News April 3, 2026
మెగాస్టార్ 158 మూవీ ఆ రోజే ప్రారంభం?

మెగాస్టార్ చిరంజీవి – దర్శకుడు బాబీ కాంబినేషన్‌లోని ‘మెగా 158’ ప్రాజెక్టు ఈనెల 11న లాంచ్ కానున్నట్లు సమాచారం. ఏప్రిల్ 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని.. దీని కోసం చిత్ర యూనిట్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ‘వాల్తేర్ వీరయ్య’ హిట్ తర్వాత మరోసారి ఈ చిరు-బాబీ కాంబోలో మూవీ రానుండటంతో దీనిపై అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించనున్నారు.


