News January 20, 2026
ములుగు: సీట్ బెల్ట్ పెట్టుకోండి.. హెల్మెట్ ధరించండి..!

అతివేగం ప్రమాదకరమని, సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాలు కాపాడుకోవాలని అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ వినోద్ రెడ్డి అన్నారు. ములుగులో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో రోడ్డు భద్రత పోస్టర్‌ను ఆవిష్కరించారు. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. జిల్లాను రోడ్డు ప్రమాదరహితంగా మార్చుకుందామన్నారు. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయొద్దని, మైనర్లకు వాహనాలు ఇవ్వడం నేరమని తెలిపారు.
Similar News
News April 18, 2026
మదనపల్లె: 25న పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్

ఈనెల 25న పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు మదనపల్లె జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ శనివారం పేర్కొన్నారు. రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణ మండలి(SBTET), మంగళగిరి కార్యదర్శి ఆదేశాలతో POLYCET-2026 హాల్ టికెట్లు 18న ఉదయం11కు డౌన్లోడ్ చేసుకునేలా అందుబాటులో ఉంచబడతాయన్నారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను వాట్సాప్ గవర్నెన్స్ 9552300009 పొందాలన్నారు.
News April 18, 2026
TU: డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు.. 151 మంది గైర్హాజరు

తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో డిగ్రీ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలు ప్రారంభమై ప్రశాంతంగా జరిగాయని అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. శనివారం 29 పరీక్షా కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం జరిగిన 1, 6వ సెమిస్టర్ పరీక్షలకు మొత్తం 5,409 మంది విద్యార్థులకు 5,258 మంది విద్యార్థులు హాజరు కాగా 151 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు.
News April 18, 2026
ఎన్యుమరేటర్లకు సహకరించండి: సబ్ కలెక్టర్

ఇంటి వద్దకు వచ్చిన ఎన్యుమరేటర్లకు ప్రతి ఒక్క పౌరుడు సహకరించాలని రాజంపేట సబ్ కలెక్టర్ భావన పేర్కొన్నారు. 2027 జనాభా లెక్కల ప్రక్రియ ఈనెల 16 నుంచి 30వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. ప్రతి పౌరుడు ఆన్లైన్‌లో తమ ఇంటి వివరాలు నమోదు చేసుకోవాలని ఆమె కోరారు. తర్వాత ఎన్యుమరేటర్లకు ఐడి చెబితే, మిగిలిన వివరాలు వారు నమోదు చేస్తారని తెలిపారు. ప్రతి పౌరుడి వివరాలు సురక్షితంగా, గోప్యంగా ఉంచబడతాయని అన్నారు.


