News January 20, 2026
భూపాలపల్లి జిల్లాలో 13 గ్రామాల్లో రీసర్వే: కలెక్టర్

జిల్లాలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. మంగళవారం హైదరాబాద్ నుంచి రెవెన్యూ కార్యదర్శి లోకేశ్ కుమార్ రీసర్వేపై అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు ఐడీఓసీ నుంచి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. జిల్లాలో మొదట దశగా మొత్తం 13 గ్రామాలను రీసర్వే చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు.
Similar News
News March 31, 2026
చింతలపూడి నగర పంచాయతీలో అవినీతికి అందలం..!

చింతలపూడి నగరపంచాయతీలో <<19521774>>టెండర్ల ప్రక్రియ రద్దు<<>> అవినీతి ఆరోపణలకు దారితీసింది. సాఫ్ట్ లోన్ పనులకు టెండర్లు పిలిచి, ప్రైస్ లిస్ట్ ప్రకటించిన తర్వాత అధికారులు వాటిని రద్దు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమ వారికి టెండర్లు దక్కలేదనే ఈ నిర్ణయం తీసుకున్నారని, దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం జిల్లాలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
News March 31, 2026
NTR జిల్లాలో అక్కడ వారం రోజులు మాంసం బంద్

చందాపురం గ్రామంలో డయేరియా ప్రబలుతున్న దృష్ట్యా మున్సిపాలిటీ కీలక నిర్ణయం తీసుకుంది. నందిగామ పురపాలక సంఘం పరిధిలోని అన్ని హోటల్స్, చికెన్ షాపులు, కర్రి పాయింట్లలో మాంసం నిషేధించాలని ఆదేశాలిచ్చింది. ఈనెల31 (నేడు) నుంచి ఏప్రిల్ 8 వరకు ఆదేశాలు అమలులో ఉంటాయని మున్సిపల్ కమిషనర్ లోవరాజు తెలిపారు.
News March 31, 2026
కృష్ణా: ‘ఉదయం పరీక్ష రాశాడు’..’సాయంత్రానికి శవమయ్యాడు’

గూడూరు(M) జొన్నలరేవు సమీపంలోని బందరు కాలువలో సోమవారం పదో తరగతి విద్యార్థి మృతి చెందిన విషయం విధితమే. రాయవరం గ్రామానికి చెందిన ఉద్దంటి దేవ హర్ష (16) ప్రస్తుతం పదో తరగతి చదువుతూ పబ్లిక్ పరీక్షలు రాస్తున్నాడు. సోమవారం పరీక్ష రాసి ఇంటికి వచ్చిన హర్ష, స్నేహితులతో కలిసి సరదాగా జొన్నలరేవు సమీపంలోని బందరు కాలువ వద్దకు స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.


