News January 20, 2026

జగిత్యాల: వృద్ధుల వసతి భవన్, డే కేర్ సెంటర్ ప్రారంభం

image

జగిత్యాల జిల్లా కేంద్రంలోని తారకరామ నగర్‌లో రూ.1.50 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ వృద్ధుల వసతి భవన్, అలాగే పట్టణ బైపాస్ రోడ్డులో డే కేర్ సెంటర్‌ను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. అసోసియేషన్ భవనానికి ప్రభుత్వ స్థలం కేటాయించాలని వినతిపత్రం సమర్పించారు.

Similar News

News February 9, 2026

175 నియోజకవర్గాల ర్యాంకింగ్.. ప్రకాశం లాస్ట్.!

image

APలోని 175 నియోజకవర్గాలకు ప్రభుత్వం వివిధ అంశాల ప్రాతిపదికన ర్యాంకులు కేటాయించింది. ఇందులో ప్రకాశం జిల్లాలోని ఒంగోలు(77), కందుకూరు(78), కొండపి(79) మార్కులతో రాష్ట్రంలోనే చివరి స్థానానికి పడిపోయాయి. మొత్తంగా 21 నియోజకవర్గాలకు A-ప్లస్, 153 నియోజకవర్గాలకు A-గ్రేడ్ లభించగా, ఒక నియోజకవర్గం B-గ్రేడ్‌లో నిలిచింది. 13 నియోజకవర్గాలు 90% పైగా స్కోరు సాధించాయి.

News February 9, 2026

మెదక్: ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించాలి: కలెక్టర్

image

మెదక్, తూప్రాన్, రామాయంపేట, నర్సాపూర్ మున్సిపాలిటీలకు ఈ నెల 11న ఉ.7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న పోలింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నిశ్శబ్ద కాలం (Silent Period) అమల్లో ఉంటుందని తెలిపారు. ఈ సమయంలో అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించాలన్నారు.

News February 9, 2026

వెట్టి చాకిరీ లేని సమాజమే లక్ష్యం: పార్వతీపురం కలెక్టర్

image

వెట్టి చాకిరీ వ్యవస్థ ఒక సామాజిక దుష్ప్రభావమని, దానిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ డా.యన్.ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పార్వతీపురంలో వెట్టి చాకిరీ వ్యవస్థ నిర్మూలన దినోత్సవం సందర్భంగా కార్మిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కల్పించారు. ఎవరైనా వ్యక్తులను బలవంతంగా పనిలో ఉంచుకోవడం, తక్కువ వేతనంతో వెట్టి చాకిరీ చేయించుకోవడం చట్టరీత్యా నేరమన్నారు.