News January 20, 2026

HYD: ట్రాఫిక్ పోలీసుల సేఫ్టీ.. స్టైలిష్ లుక్!

image

రోడ్లపై నిలబడి ఎండ, ధూళితో కుస్తీ పట్టే మన ట్రాఫిక్ అన్నలకు ఇప్పుడు అదిరిపోయే రక్షణ దొరికింది. సైబరాబాద్ జాయింట్ CP గజరావు భూపాల్ చేతుల మీదుగా సిబ్బందికి స్పెషల్ గాగుల్స్ పంపిణీ చేశారు. ఎండ వేడిమి, కాలుష్యం నుంచి కళ్లను కాపాడుకుంటేనే, పోలీసులు ప్రజలకు మెరుగైన సేవలు అందించగలరని ఆయన ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. ఇప్పుడు మన ట్రాఫిక్ పోలీసులు హెల్తీగా, స్టైలిష్‌గా డ్యూటీ చేయబోతున్నారు.

Similar News

News February 10, 2026

HYDలో 3 కమిషనరేట్లు CONFIRM.. నంబర్లు ఇవే!

image

GHMCలో పాలనను పరుగులు పెట్టించేందుకు ప్రవేశపెట్టిన 3 ప్రధాన కమిషనరేట్ల ప్రతిపాదన అధికారికంగా ఖరారైంది. ఆర్వీ.కర్ణన్, టీ.వినయ్ కృష్ణారెడ్డి, జీ.సృజన నేతృత్వంలో జోన్లు, సర్కిళ్లు విడిపోయాయి. మొత్తం 12 జోన్లు, 60 సర్కిళ్ల పరిధిలోని జడ్సీలు, డిప్యూటీ కమిషనర్ల ఫోన్ నంబర్లతో కూడిన జాబితా విడుదలైంది. మహానగరం 3 ముక్కలై.. అతిపెద్ద కార్పొరేషన్‌గా అవతరించింది. పైన ఫొటోలో నంబర్లు ఉన్నాయి. #SAVE IT.

News February 10, 2026

పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు.. HYDలో ఖాళీలు ఇవే..!

image

ఇండియన్ పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. HYD డివిజన్ పరిధిలో డాక్ సేవక్-7, HYD సోర్టింగ్ డివిజన్లో డాక్ సేవక్- 23 పోస్టులు ఉన్నాయి. HYD సౌత్ ఈస్ట్ పరిధిలో డాక్ సేవక్-22, ABPM-9, BPM-10, సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో డాక్ సేవక్-12, ABPM-4, BPM-8 పోస్టులు ఉన్నాయి. వెబ్‌సైట్ indiapostgdsonline.cept.gov.inలో అప్లై చేసుకోండి.

News February 10, 2026

HYDలో 2 రోజులు వాటర్ బంద్

image

ఆర్సీపురం, అశోక్‌నగర్‌, జ్యోతినగర్‌, లింగంపల్లి, చందానగర్‌, గంగారం, మదీనాగూడ, మియాపూర్‌, బీరంగూడ, అమీన్‌పూర్‌, భాగ్యనగర్‌ కాలనీ, ఆఫ్‌ టేక్‌ పాయింట్స్‌, బల్క్‌ కనెక్షన్లు, ఎర్రగడ్డ, ఎస్‌ఆర్‌నగర్‌, అమీర్‌పేట్‌, కేపీహెచ్‌బీకాలనీ, కూకట్‌పల్లి, భాగ్యనగర్‌కాలనీ, ప్రగతినగర్‌‌కు నీటి సరఫరా ఉండదు. మంజీరా ఫేజ్- 2 మరమ్మతుల కారణంగా బుధవారం ఉ.6 నుంచి గురువారం రాత్రి 10 గం. వరకు వాటర్ నిలిచిపోతుంది.