News January 20, 2026
పెద్దపల్లి: ‘రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కఠిన చర్యలు’

PDPL జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని మంగళవారం కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. బ్లాక్‌స్పాట్ల గుర్తింపు, స్పీడ్‌బ్రేకర్లు, రోడ్డు స్ట్రిప్స్, రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. కేజీ వీల్స్ వాడే వాహనాలకు భారీ జరిమానాలు విధించి, మళ్లీ వాడితే సీజ్ చేయాలన్నారు. పశువులను రోడ్లపై వదిలితే రూ.10వేలు జరిమానా, డ్రంక్ & డ్రైవ్ తనిఖీలు పెంచాలని ఆదేశించారు.
Similar News
News April 13, 2026
ప.గో : ఈ మున్సిపాలిటీలకు ఈసారైనా ఎన్నికలు జరిగేనా ?

పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరం, పాలకొల్లు మున్సిపాలిటీలకు సమీప గ్రామాల విలీనంపై కోర్టు కేసులు ఉండటంతో దాదాపు పదేళ్లుగా ఎన్నికలకు నోచుకోలేదు. ప్రస్తుతం డీలిమిటేషన్ ప్రక్రియ జరుగుతోంది. ముగియగానే ఆగస్టు, సెప్టెంబర్ నెలలో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. 4 మున్సిపాలిటీలకు కోర్టు కేసులు పరిష్కారం తర్వాతే ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
News April 13, 2026
తిరుపతి జిల్లాలో ఇచ్చిందే తీసుకోవాలంట..!

తిరుపతి జిల్లాలో గ్యాస్ బుకింగ్‌కు కాల్ చేస్తే వెంటనే కట్ అయిపోతోంది. ఆటోమేటిక్‌గా వారం లేదా 10 రోజులకు OTP వస్తోంది. కొన్ని సంస్థలు సిలిండర్ డెలివరీకి 20 రోజులు తీసుకుంటున్నాయి. 5కేజీ, 10కేజీ, 14 కేజీల సిలిండర్లు ఉంటాయి. ప్రజలు కోరింది కాకుండా ఆటోమేటిక్ సిస్టం ద్వారా ఏది వస్తే అది తీసుకోవాల్సి వస్తోంది. వచ్చిన గ్యాస్ తిరిగి వెళ్లిపోవడం, ఖాళీ సిలిండర్లు లేకపోవడం సరఫరా చేయడానికి ఆలస్యమవుతోంది.
News April 13, 2026
పాత ఇంట్లో దొరికిన నాణెం.. వేలంలో ₹1.2కోట్లు

బ్రిటన్ చరిత్రలోనే అత్యంత అందమైన నాణెంగా పేరుగాంచిన ‘యూనా అండ్ ది లయన్’ గోల్డ్ కాయిన్ వేలంలో £110,000 (సుమారు ₹1.2 కోట్లు) పలికింది. వేల్స్‌లోని ఒక పాత ఇంట్లో దొరికిన ఈ ఐదు పౌండ్ల నాణేన్ని 1839లో క్వీన్ విక్టోరియా పట్టాభిషేక జ్ఞాపకార్థం ముద్రించారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటివి 300 మాత్రమే ఉండటంతో కాయిన్ కలెక్టర్స్ దీనిని నాణేల ప్రపంచంలో ‘హోలీ గ్రెయిల్’(అత్యంత అరుదైనది)గా భావిస్తారు.


