News January 20, 2026

సిరిసిల్ల: గోశాలల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు

image

అధునాతన గోశాలల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ సెక్రటరీ ఇలంబర్తి తెలిపారు. అధునాతన పద్ధతుల్లో వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి, ఆలయానికి అనుబంధంగా గోశాలల నిర్మాణం తదితర అంశాలపై రాజన్న సిరిసిల్ల కలెక్టర్ తో రాష్ట్ర పశు సంవర్ధక శాఖ సెక్రటరీ ఇలంబర్తి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, ఇంచార్జ్ కలెక్టర్ గరీమ అగ్రవాల్ పాల్గొన్నారు.

Similar News

News April 4, 2026

జీఎస్టీ వసూళ్లలో TOP-6లో కడప డివిజన్

image

కడప డివిజన్లో జీఎస్టీ వసూళ్లు 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.851.44 కోట్లు రాగా.. 2025-26లో రూ.932.83 కోట్లు వచ్చాయని SGST కడప జాయింట్ కమిషనర్ సుమతి తెలిపారు. నెలకు సగటున రూ.70.95 కోట్లు జీఎస్టీ వసూలయ్యాయి. రూ.82.38 కోట్ల పెరుగుదల నమోదైంది. రూ.2025 మార్చిలో రూ.73.31 కోట్లు రాగా.. 2026 మార్చిలో రూ.84.39 కోట్లకు పెరిగాయి. గత నెలలో SGST నగదు వసూళ్లలో రూ.38.79 కోట్లతో స్టేట్‌లో కడప టాప్-6లో నిలిచింది.

News April 4, 2026

ఈనెల 15 నుంచి బీఎల్‌ఐఎస్‌సీ దూరవిద్య పరీక్షలు

image

కాకతీయ యూనివర్సిటీ దూరవిద్య(సీడీఓఈ/ఎస్‌ఓఎల్‌డీసీఈ) పరిధిలో బీఎల్‌ఐఎస్‌సీ ఇయర్‌వైజ్ ఎక్స్ అభ్యర్థులకు ఈనెల 15 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య రాజేందర్, అదనపు నియంత్రణాధికారి డా.పద్మజ తెలిపారు. 15, 17, 20, 22, 24, 27, 29వ తేదీల్లో ఈ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. ప్రతి రోజు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

News April 4, 2026

ఖమ్మం : భార్యకు మెసేజ్‌లు పంపుతున్నాడని..

image

భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి మరో వ్యక్తిపై కత్తితో దాడి చేసిన ఘటన ఖమ్మం రూరల్ మండలంలో కలకలం రేపింది. గొళ్లపాడుకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ సంపేట శివపై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. తల్లంపాడు వెంచర్ నుంచి తిరిగి వస్తుండగా, ఆరెకోడు క్రాస్ రోడ్ వద్ద శివను అడ్డగించి కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలతో తప్పించుకున్న శివ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.