News January 20, 2026
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌కు అవార్డు

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ 2025 సంవత్సరానికి ‘Overall Election Management’ విభాగంలో ఉత్తమ ఎన్నికల నిర్వహణ పురస్కారం లభించింది. జిల్లాలో ఎన్నికల ప్రక్రియను సమర్థంగా నిర్వహించినందుకు ఈ గౌరవం దక్కింది. ఈ పురస్కారాన్ని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించే 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో ప్రదానం చేయనున్నారు.
Similar News
News April 8, 2026
TMCపై EC పోస్ట్ వివాదం.. సమంజసమేనా?

‘ఈసారి బెంగాల్ ఎన్నికలు భయం, హింస, బూత్ జామింగ్ లేకుండా జరుగుతాయి’ అని EC చేసిన X పోస్ట్ వివాదాస్పదమైంది. నేరుగా TMCని ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు సమంజసమేనా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. తప్పు జరిగితే స్వతంత్ర సంస్థగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి కానీ, రాజకీయ పార్టీల్లా విమర్శించడమేంటని నిలదీస్తున్నారు. ఓ రాజ్యాంగబద్ధ సంస్థ ఇలా పరిధి దాటి ప్రవర్తించడం సరికాదంటున్నారు. దీనిపై మీ COMMENT?
News April 8, 2026
ఖమ్మం సీపీఐ(ఎంఎల్)నేతకు NIA నోటీసులు

ఖమ్మం జిల్లాకు చెందిన సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావుకు ఎన్ఐఏ నోటీసు జారీ చేసింది. దేశద్రోహం, ఉపా కేసులకు సంబంధించి ఈ నెల 22న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని పేర్కొంది. BNS 152(13&39) సెక్షన్ కింద నోటీసు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆధార్ చిరునామా ఆధారంగా నల్గొండ జిల్లాలోని రంగాపురంలోని నివాసానికి నోటీసు అందజేశారు.
News April 8, 2026
FLASH: గచ్చిబౌలిలో ONE YEAR ఆంక్షలు

గచ్చిబౌలి IIIT జంక్షన్ వద్ద ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణ పనుల దృష్ట్యా సైబరాబాద్ పోలీసులు నేటి నుంచి సుమారు ఏడాది పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గచ్చిబౌలి నుంచి లింగంపల్లి, విప్రో జంక్షన్ నుంచి IIIT వైపు వెళ్లే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లిస్తున్నారు. ఉదయం 8 నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. వాహనదారులు, ఐటీ ఉద్యోగులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
SHARE IT


