News January 20, 2026

నెల్లూరు: 27 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్

image

నెల్లూరు జిల్లాలో ఈనెల 27 నుంచి ఇంటర్ ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. దీంతో ఇంటర్ ఆర్ఐ, DEC సభ్యులతో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.విజయ్ కుమార్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈనెల 21న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, 23న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఎలాంటి లోటుపాట్లు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News January 30, 2026

నెల్లూరులో దారుణం

image

దారి చూపి అండగా ఉండాల్సిన కన్న తండ్రి కామాంధుడై కూతురుపై లైంగిక దాడికి పాల్పడుతున్న ఘటన నెల్లూరులో కలకలం రేపింది. నగరానికి చెందిన ఓ దంపతులకు ఆరేళ్ల కుమార్తె ఉంది. ఆమె ఆలనా పాలన చూసుకోవాల్సిన తండ్రి కూతురుపై కన్నేసి కొన్ని రోజులుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. గమనించిన తల్లి భర్తపై సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News January 30, 2026

నెల్లూరు: ఇద్దరికి పదేళ్ల జైలుశిక్ష

image

సూళ్లూరుపేట మండలం మన్నారుపోలూరు హైవే క్రాస్ రోడ్డు వద్ద 2018 సెప్టెంబర్ 10న పోలీసులు తనిఖీలు చేస్తుండగా 200KGల గంజాయి పట్టుబడింది. తమిళనాడు(ST) సేలం జిల్లా పెదనాయకంపాళేనికి చెందిన మహదేవన్, వెంకటేశ్‌ను అరెస్ట్ చేశారు. నేరం రుజువు కావడంతో 10ఏళ్ల జైలు శిక్ష, రూ.లక్ష చొప్పున ఇద్దరికి జరిమానాను విధిస్తూ నెల్లూరు ఫస్ట్ ఆడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి గీత గురువారం తీర్పు చెప్పారు.

News January 30, 2026

తిరుమల లడ్డూ ఘటనలో నిజమే గెలిచింది: కాకాణి

image

తిరుమల లడ్డు ప్రసాదంపై ఇటీవల జరిగిన అసత్య ప్రచారాలు, ఆధారరహిత ఆరోపణలు పూర్తిగా అబద్ధమని సీబీఐ నివేదికతో స్పష్టమైందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నిజమే గెలిచిందని పేర్కొన్నారు. గురువారం ఆయన నగరంలోని మాగుంట లే అవుట్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నాయకులు, భక్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.