News January 20, 2026

HYDలో అమ్మాయిలు భయపడకండి!

image

సిటీలో పోకిరీల ఆటలు సాగనివ్వమని ‘షీ టీమ్స్’ మరోసారి ప్రూవ్ చేశాయి. కేవలం వాట్సాప్ టిప్స్‌తో డిసెంబర్‌లో 13 మందిని పట్టుకుంటే, జనవరి నాటికి ఆ జోరు మరింత పెరిగింది. సైబరాబాద్‌లో 127 డెకాయ్ ఆపరేషన్లతో ఏకంగా 59 మంది వేధింపుల రాయుళ్లను జైలుకు పంపారు. ఇదే గ్యాప్‌లో యువత ఫెర్టిలిటీ అవేర్‌నెస్, ఒంటరితనంపై కూడా ‘రియల్ టాక్’ మొదలుపెట్టింది. వేధింపులు ఉంటే 9490616555కు ఫిర్యాదు చేయండి. భయం అస్సలు వద్దు!

Similar News

News February 5, 2026

మాసబ్‌ట్యాంక్ ‘మాయాజాలం’.. ఫైళ్లలోనే గిరిజన రేషన్ తినేశారు!

image

మాసాబ్‌ట్యాంక్‌లోని AC గదుల్లో కూర్చొని ఆశ్రమ పాఠశాలల రేషన్‌ను అధికారులు స్వాహా చేశారు. TGCC ప్రధాన కార్యాలయంలో రూ.18 కోట్ల కుంభకోణం వెలుగుచూసింది. ఆశ్రమాలకు వెళ్లాల్సిన సరుకు ఆర్డర్లను ఇక్కడి GM తన బినామీ కాంట్రాక్టర్లకు అనుకూలంగా మార్చేశారు. సరుకు దించకుండానే డెలివరీ అయినట్లు డిజిటల్ సంతకాలతో ఫోర్జరీ చేశారు. HYD నుంచే జిల్లా అధికారులను మేనేజ్ చేస్తూ పంపిణీ జరగకుండానే బిల్లులు క్లియర్ చేశారు.

News February 5, 2026

HYD: ఏడుపాయల మహా జాతర తేదీలు ఇవే..!

image

తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల మహాజాతరకు అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి 15 నుంచి 17 వరకు 3 రోజుల పాటు మహాశివరాత్రి సందర్భంగా జాతరను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ జాతరకు మెదక్ జిల్లాతో పాటు సంగారెడ్డి, సిద్దిపేట, గ్రేటర్ HYD, నిజామాబాద్, కామారెడ్డి, వికారాబాద్ సహా వివిధ ప్రాంతాల నుంచి సుమారు 15 లక్షల మంది వరకు భక్తులు రానున్నారు. SHARE IT

News February 5, 2026

IT Corridorలో రొమ్ము క్యాన్సర్

image

HYDను గ్లోబల్ హబ్‌గా మార్చిన IT రంగం అక్కడి మహిళా ఉద్యోగుల పాలిట యమపాశంగా మారుతోంది. గడిచిన మూడేళ్లలో మాదాపూర్, గచ్చిబౌలి ఆసుపత్రుల్లో నమోదైన రొమ్ము క్యాన్సర్ కేసుల్లో 15% మంది 35 ఏళ్లలోపు వారే. నిరంతరం ఆర్టిఫిషియల్ లైటింగ్‌లో నైట్ షిఫ్టులు చేయడం వల్ల శరీరంలో ‘మెలటోనిన్’ హార్మోన్ ఉత్పత్తి పడిపోయి, క్యాన్సర్ కణాలను ప్రేరేపిస్తోంది. సహజమైన నిద్రకు దూరం కావడం వల్ల క్యాన్సర్‌ బారీన పడుతున్నారు.