News April 26, 2024
LS PHASE 2: ఈసారీ ఓటర్లు నిరాశపర్చారు!
ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ప్రజలు ఆసక్తి చూపించకపోవడం చర్చనీయాంశమైంది. తొలి విడతలో ఆశించిన స్థాయిలో పోలింగ్ శాతం (66.1%) నమోదు కాలేదు. ఇప్పుడూ అదే రిపీటైంది. రెండో దశ పోలింగ్ శాతం 3 గంటలకు 50.3%గా రికార్డ్ అయింది. 2019 ఎన్నికలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. 2019లో తొలి విడత 69.9%, రెండో విడత 70.1%గా నమోదయ్యాయి. భానుడి భగభగలు ఇందుకు ఓ కారణం కావొచ్చని విశ్లేషకుల అంచనా. <<-se>>#Elections2024<<>>
Similar News
News November 17, 2024
ఇలా చేస్తే గోవా టూరిజంకు బూస్ట్!
గోవా టూరిజంను తిరిగి గాడిలో పెట్టడానికి నెట్టింట కొన్ని సలహాలు వినిపిస్తున్నాయి. అవి: స్థానిక ట్యాక్సీ మాఫియా ఆగడాలను అరికట్టాలి *Luxury Roomsపై ఉన్న 28% GSTని తగ్గించాలి. *సన్ సెట్ పాయింట్లు మాత్రమే కాకుండా అమ్యూజ్‌మెంట్ పార్క్‌లు, భారీ బీచ్ క్లబ్స్, సుదీర్ఘ కాలినడక మార్గాలు ఏర్పాటు చేయాలి. *ట్రాఫిక్ నియంత్రణ, విదేశీయుల భద్రతకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మీరిచ్చే సలహాలు ఏంటి?
News November 17, 2024
పుష్ప-2 ఆ రికార్డును క్రియేట్ చేస్తుందా?
పుష్ప-2కి ఉత్తరాది రాష్ట్రాల్లో క్రేజ్ పీక్స్‌లో ఉంది. ఈ నేపథ్యంలో హిందీ బెల్ట్‌లో ఈ మూవీ రికార్డ్ కలెక్షన్లు సాధించే అవకాశం కనిపిస్తోంది. హిందీలో తొలిరోజు అత్యధిక కలెక్షన్ల రికార్డు జవాన్(రూ.63.90 కోట్లు) పేరిట ఉంది. ఇక వరల్డ్ వైడ్ ఫస్ట్ డే కలెక్షన్లలో RRR (రూ.223 కోట్లు) అగ్రస్థానంలో ఉంది. పుష్ప-2కి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆ రెండింటినీ దాటేందుకు మంచి అవకాశాలున్నాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
News November 17, 2024
బీఆర్ఎస్‌ను నిషేధించాలి: బండి సంజయ్
తెలంగాణలో BRSను నిషేధించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న BRS విధ్వంసకర పార్టీ అని ఆరోపించారు. ఆ పార్టీ నేతలను నియంత్రించాల్సిన బాధ్యత సీఎందేనని, ఆయన అసమర్థత వల్లే వారు రెచ్చిపోతున్నారని విమర్శించారు. ఇక TGలో ఇద్దరు సీఎంలు(రేవంత్, KTR) ఉన్నారని, కాంగ్రెస్, BRS కలిసి రాష్ట్రంలో నాటకాలు ఆడుతున్నాయని బండి ధ్వజమెత్తారు.