News January 20, 2026
తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి

దావోస్ వేదికగా గూగుల్ ఆసియా-పసిఫిక్ ప్రాంతీయ అధ్యక్షుడు సంజయ్ గుప్తాతో TG CM రేవంత్ భేటీ అయ్యారు. వాతావరణ మార్పులు, వ్యవసాయం, పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న కాలుష్యం, సైబర్ సెక్యూరిటీ, స్టార్టప్‌ల ప్రోత్సాహంపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు గూగుల్ ఆసక్తి చూపింది. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న CURE, PURE, RARE అభివృద్ధి ఫార్ములాను రేవంత్ వివరించారు.
Similar News
News February 6, 2026
421 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB) 421 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు నేటి నుంచి ఫిబ్రవరి 26వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, MBA/PGDM, CA/CFA/CMA అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అప్లికేషన్ స్క్రూట్నీ, ఆన్‌లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://bankofbaroda.bank.in/
News February 6, 2026
KCR చిప్పకూడు తినకుండా అడ్డుకుంటోంది ఎవరు: రేవంత్

TG: రూ.లక్ష కోట్లతో కట్టిన ‘కాళేశ్వరం’ మూడేళ్లలో కూలిపోయిందని CM రేవంత్ విమర్శించారు. గోదావరి జలాల పేరుతో కల్వకుంట్ల కుటుంబం TGని దోచుకుందని ఆరోపించారు. BJPకి అధికారం ఇస్తే KCRను జైల్లో వేస్తామన్న కిషన్ రెడ్డి ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించారు. జైల్లో KCR చిప్పకూడు తినకుండా అడ్డుకుంటోంది ఎవరు? అని నిలదీశారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఎక్కువ నిధులు వస్తాయని NZB సభలో తెలిపారు.
News February 6, 2026
మాకు పాఠాలు చెప్పొద్దు.. ట్రంప్‌కు ‘నోబెల్’ ప్రతిపాదనపై పోలండ్

ట్రంప్‌ను నోబెల్ బహుమతికి నామినేట్ చేయాలని US పంపిన ప్రతిపాదనలను పోలండ్ తిరస్కరించింది. అవార్డుకు ఆయన అర్హుడు కాదని పార్లమెంట్ స్పీకర్ జాజెస్టీ ప్రకటించారు. దీంతో ఇది ట్రంప్‌ను అవమానించడమేనని US దౌత్యవేత్త టామ్ రోజ్ విమర్శించారు. దీనికి పోలండ్ PM టస్క్ కౌంటరిచ్చారు. ‘అంబాసిడర్ రోజ్ మనం ఒకరినొకరు గౌరవించుకోవాలి. అంతేకానీ పాఠాలు చెప్పొద్దు. దౌత్యం ఎలా నిర్వహించాలో మాకు తెలుసు’ అని పేర్కొన్నారు.


