News April 26, 2024
త్రిపుర ఓటర్లూ.. మీరు గ్రేట్
లోక్‌సభ ఎన్నికలు ఇతర రాష్ట్రాల్లో నీరసంగా సాగుతుంటే ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో మాత్రం ఉత్సాహంగా జరిగాయి. తొలి విడత, ఈరోజు జరిగిన రెండో విడత ఎన్నికల్లోనూ అత్యధిక పోలింగ్ శాతం నమోదైన రాష్ట్రంగా త్రిపుర టాప్‌లో ఉంది. ఈ రాష్ట్రంలో తొలి విడతలో 80.17% పోలింగ్ నమోదైతే, రెండో విడతలో 5 గంటలకు 76.23%గా రికార్డ్ అయింది. మరోవైపు మణిపుర్‌లో 76.06%, బెంగాల్‌లో 71.04% పోలింగ్ నమోదైంది. <<-se>>#Elections2024<<>>
Similar News
News November 17, 2024
ఇలా చేస్తే గోవా టూరిజంకు బూస్ట్!
గోవా టూరిజంను తిరిగి గాడిలో పెట్టడానికి నెట్టింట కొన్ని సలహాలు వినిపిస్తున్నాయి. అవి: స్థానిక ట్యాక్సీ మాఫియా ఆగడాలను అరికట్టాలి *Luxury Roomsపై ఉన్న 28% GSTని తగ్గించాలి. *సన్ సెట్ పాయింట్లు మాత్రమే కాకుండా అమ్యూజ్‌మెంట్ పార్క్‌లు, భారీ బీచ్ క్లబ్స్, సుదీర్ఘ కాలినడక మార్గాలు ఏర్పాటు చేయాలి. *ట్రాఫిక్ నియంత్రణ, విదేశీయుల భద్రతకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మీరిచ్చే సలహాలు ఏంటి?
News November 17, 2024
పుష్ప-2 ఆ రికార్డును క్రియేట్ చేస్తుందా?
పుష్ప-2కి ఉత్తరాది రాష్ట్రాల్లో క్రేజ్ పీక్స్‌లో ఉంది. ఈ నేపథ్యంలో హిందీ బెల్ట్‌లో ఈ మూవీ రికార్డ్ కలెక్షన్లు సాధించే అవకాశం కనిపిస్తోంది. హిందీలో తొలిరోజు అత్యధిక కలెక్షన్ల రికార్డు జవాన్(రూ.63.90 కోట్లు) పేరిట ఉంది. ఇక వరల్డ్ వైడ్ ఫస్ట్ డే కలెక్షన్లలో RRR (రూ.223 కోట్లు) అగ్రస్థానంలో ఉంది. పుష్ప-2కి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆ రెండింటినీ దాటేందుకు మంచి అవకాశాలున్నాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
News November 17, 2024
బీఆర్ఎస్‌ను నిషేధించాలి: బండి సంజయ్
తెలంగాణలో BRSను నిషేధించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న BRS విధ్వంసకర పార్టీ అని ఆరోపించారు. ఆ పార్టీ నేతలను నియంత్రించాల్సిన బాధ్యత సీఎందేనని, ఆయన అసమర్థత వల్లే వారు రెచ్చిపోతున్నారని విమర్శించారు. ఇక TGలో ఇద్దరు సీఎంలు(రేవంత్, KTR) ఉన్నారని, కాంగ్రెస్, BRS కలిసి రాష్ట్రంలో నాటకాలు ఆడుతున్నాయని బండి ధ్వజమెత్తారు.