News January 21, 2026

ఏలూరు: మహిళలకు GOOD NEWS

image

ఏలూరు జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల మహిళలు పీఏం అజయ్ పథకానికి దరఖాస్తు చేయాలని డీఆర్ డీఏ విజయరాజు మంగళవారం తెలిపారు. ఒక్కొక్కరికి రూ.50 వేల రాయితీ ఉంటుందన్నారు. లబ్దిదారులు 20 నుంచి 35 ఏళ్లలోపు వారే ఉండాలన్నారు. రూ.1 లక్ష నుంచి రూ.3 లక్షల వరకు వడ్డీ లేని రుణం పొందవచ్చన్నారు. ఆటో కూడా తీసుకోవచ్చని అన్నారు. మరిన్ని వివరాలకు మండల సమాఖ్య కార్యాలయన్ని సంప్రదించాలన్నారు.

Similar News

News January 28, 2026

కృష్ణా: పవన్ కళ్యాణ్‌తో ఎంపీ బాలశౌరి భేటీ

image

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి బుధవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్‌ను ఎంపీ కలిశారు. సుమారు గంటపాటు సాగిన ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్‌లో ఉన్న వివిధ ప్రాజెక్టులపై కూలంకషంగా చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మచిలీపట్నం పోర్టు పనులు, నియోజకవర్గ సమస్యలను పవన్ దృష్టికి బాలశౌరి తీసుకెళ్లారు.

News January 28, 2026

ప్రభుత్వ పథకాలను రైతులకు చేరువ చేయండి: కలెక్టర్

image

జిల్లాలో వివిధ పంటలు సాగు చేస్తున్న రైతులకు ఖర్చులకు అనుగుణంగా పంట రుణాల మంజూరుకు మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకుంటామని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ (కేడిసిసి) ఎన్టీఆర్ జిల్లా స్థాయి సాంకేతిక కమిటీ సమావేశం బుధవారం కలెక్టరేట్‌లో జరిగింది. గత ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లలో వివిధ పంటల సాగు వ్యయం, పంట దిగుబడి విలువ, రుణ పరిమితి వివరాలను కలెక్టర్ పరిశీలించారు.

News January 28, 2026

నిజామాబాద్: జిల్లా కలెక్టర్‌తో ఎలక్షన్ అబ్జర్వర్ భేటీ

image

మున్సిపల్ ఎన్నికల జనరల్ అబ్జర్వర్ సి.హెచ్. సత్యనారాయణ రెడ్డి బుధవారం నిజామాబాద్ కలెక్టరేట్‌లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠితో భేటీ అయ్యారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు చేసిన ఏర్పాట్లపై కలెక్టర్ ఆయనకు వివరించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం పూర్తి పారదర్శకంగా, పకడ్బందీగా ఎన్నికలు జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామని ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు.