News January 21, 2026

ANU: డిగ్రీ 6th సెమిస్టర్ వైవా షెడ్యూల్ రిలీజ్

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో 6వ సెమిస్టర్ వైవా షెడ్యూల్ ను యూనివర్సిటీ అధికారులు విడుదల చేశారు. ఏప్రిల్ 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆరో సెమిస్టర్ వైవా జరుగుతోందన్నారు. విద్యార్థులు ఫిబ్రవరి 20వ తేదీలోపు ఫీజు చెల్లించాలన్నారు. అపరాధ రుసుం రూ.100తో 23వ తేదీలోపు చెల్లించాలన్నారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీలోని సంబంధిత అధికారులను సంప్రదించాలన్నారు.

Similar News

News February 16, 2026

అస్సాం, WB ఎన్నికలపై బంగ్లా పరిణామాల ప్రభావం

image

దేశ సరిహద్దులోని బంగ్లా ఎన్నికల ప్రభావం అస్సాం, WB అసెంబ్లీ ఎలక్షన్లపై ఏమేరకు ఉంటుందన్నది చర్చగా మారింది. మొత్తం జనాభాలో ముస్లింలు అస్సాంలో 40%, WBలో 30% ఉన్నారు. వీరిలో అక్రమ వలసదారులే అధికం. బంగ్లాలో ఏ పరిణామం చోటుచేసుకున్నా ఆ ప్రభావం ఈ రాష్ట్రాలపై పడుతోంది. బంగ్లా హిందువులపై దాడులను BJP 2 రాష్ట్రాల్లో ప్రచారాస్త్రంగా చేసుకుంది. అయితే అక్కడ BNP అధికారంలోకి రావడంతో మార్పు ఉంటుందేమో చూడాలి.

News February 16, 2026

సంచలనం.. ఒకే ఫార్మాట్లో 700 వికెట్లు

image

అఫ్గానిస్థాన్ మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్ T20 క్రికెట్‌లో సంచలనం నమోదు చేశారు. T20WCలో భాగంగా ఇవాళ UAE బ్యాటర్ అర్ఫాన్‌ను ఔట్ చేయడంతో ఈ ఫార్మాట్‌లో 700 వికెట్లు తీసిన తొలి ప్లేయర్‌గా నిలిచారు. అన్ని లీగ్స్‌లో కలిపి ఈ ఘనత సాధించారు. అఫ్గాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో ఇది 191వ వికెట్. కాగా ఓవరాల్ వికెట్ల జాబితాలో ఆ తర్వాతి స్థానాల్లో బ్రావో(వెస్టిండీస్-631), నరైన్(వెస్టిండీస్-613*) ఉన్నారు.

News February 16, 2026

పీరియడ్ పెయిన్స్ తగ్గించే ఫుడ్ ఇదే..

image

పీరియడ్స్‌లో కొందరికి విపరీతంగా కడుపు, నడుంనొప్పి వస్తుంటాయి. వీటిని తగ్గించాలంటే కొన్ని ఆహారపదార్థాలను డైట్‌లో చేర్చుకోవాలంటున్నారు నిపుణులు. నానబెట్టిన ఎండు ద్రాక్ష, చేమ దుంప, చిలగడదుంప వంటి దుంపజాతి కూరగాయలు తినడం మంచిదని సూచిస్తున్నారు. అలాగే అరటిపండు, అరటి కాయ, అరటి పువ్వును వంటకాల్లో భాగం చేసుకొని తీసుకోవచ్చు. హార్మోన్లను సమతులంగా ఉంచడంలో అరటి పువ్వు కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు నిపుణులు.