News January 21, 2026

ఏడేడు జన్మల బంధం సాధ్యమేనా?

image

భార్యాభర్తల బంధం ఒక్క జన్మకే పరిమితం కాదని పండితులు చెబుతున్నారు. ప్రతి జన్మలోనూ ఒకే వ్యక్తి భాగస్వామిగా రావడం కర్మ సూత్రాల ప్రకారం కష్టమైనప్పటికీ దైవానుగ్రహంతో సాధ్యమేనని వివరిస్తున్నారు. ఓ వ్యక్తి తన భాగస్వామి పట్ల నిష్కల్మష ప్రేమను కలిగి ఉండి, దైవచింతనతో కూడిన కఠినమైన తపస్సు, ప్రత్యేక ఆరాధన చేసినప్పుడు, ఆ భక్తికి మెచ్చి దేవుడు తదుపరి జన్మల్లో కూడా అదే తోడును ప్రసాదిస్తారని పండితుల అభిప్రాయం.

Similar News

News March 21, 2026

తెనాలి: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళ మృతి

image

పురుగుల మందు ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. తెనాలి మండలం నందివెలుగు గ్రామానికి చెందిన వెంకటలక్ష్మి(48) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. వైద్యశాల నుంచి వచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ ఆనంద్ కేసు నమోదు చేశారు.

News March 20, 2026

ధురంధర్-2తో బాక్సాఫీసు షేక్.. రికార్డులు బ్రేక్!

image

ధురంధర్-2 బాక్సాఫీసు వద్ద రికార్డులు బద్దలు కొడుతోంది. మొదటిరోజే ₹102.55కోట్ల నెట్ సాధించిన ఈ చిత్రం ఒక్క హిందీ వర్షన్‌తోనే ₹99.10Cr రాబట్టింది. బాలీవుడ్ సినిమాల్లో ఇదే అత్యధికం. ప్రపంచవ్యాప్తంగా పుష్ప-2 (₹275.2కోట్లు) తర్వాత బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించిన రెండో భారతీయ సినిమాగా ధురంధర్-2 (₹236.63Cr) నిలిచింది. పెయిడ్ ప్రివ్యూల్లో OG (₹25కోట్లు)ని బీట్ చేసి ₹43కోట్లు వసూలు చేసింది.

News March 20, 2026

CRDA కొత్త కమిషనర్‌గా విజయరామరాజు

image

AP: రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. సీఆర్‌డీఏ కమిషనర్ కన్నబాబును పౌరసరఫరాల కమిషనర్‌గా నియమించింది. ఆయన స్థానంలో CRDA కమిషనర్‌గా విజయరామరాజు బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక మార్కాపురం కలెక్టర్‌గా విజయ సునీత, పోలవరం కలెక్టర్‌గా దినేశ్ కుమార్ నియమితులయ్యారు.