News January 21, 2026

సంగారెడ్డి: జిల్లాలో బీజేపీ ప్రభారీల నియామకం

image

మున్సిపల్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ రాష్ట అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆయా మున్సిపాలిటీలకు ప్రభారీలను నియమించారు. సంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీలకు ప్రభారీలను నియమించినట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేందర్‌గౌడ్‌ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జహీరాబాద్‌ ప్రభారీగా పైడి ఎల్లారెడ్డి, అందోల్‌ జోగిపేట మున్సిపాలిటీకి జె.రంగారెడ్డి, నారాయణఖేడ్ ఆలే భాస్కర్ నియమితులయ్యారు.

Similar News

News February 11, 2026

సిరిసిల్ల: వీల్ చైర్‌లో వచ్చి ఓటేసిన సీనియర్ న్యాయవాది

image

సిరిసిల్లకు చెందిన ప్రముఖ న్యాయవాది, వినియోగదారుల సంక్షేమ మండలి మాజీ అధ్యక్షుడు శాంతి ప్రకాష్ శుక్లా వీల్ చైర్‌లో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సుమారు 80 సంవత్సరాల వయసున్న ఆయన ఆరోగ్యం సహకరించక పోయినప్పటికీ ప్రజాస్వామ్యంపై మక్కువతో చక్రాల కుర్చీలో వచ్చి ఓటు వేశారు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడానికి ఆయనకు స్థానికంగా ఉన్న పోలీసులు, పోలింగ్ సిబ్బంది సహకరించారు.

News February 11, 2026

ESIC హాస్పిటల్ భిలాయ్‌లో ఉద్యోగాలు

image

<>ఛత్తీస్‌గఢ్‌<<>>, భిలాయ్‌లోని ESIC హాస్పిటల్ 21 స్పెషలిస్ట్, సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గలవారు FEB 25న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో PG/డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. ఫుల్‌టైమ్ స్పెషలిస్టుకు నెలకు రూ.1,37,837, పార్ట్ టైమ్ స్పెషలిస్ట్‌కు రూ.60,000, సీనియర్ రెసిడెంట్‌కు రూ.1,37,837 చెల్లిస్తారు. సైట్: https://esic.gov.in

News February 11, 2026

శివరాత్రికి మైపాడు వెళ్తారా..?

image

మైపాడు బీచ్ వద్ద ఉన్న భారీ శివలింగం మహా శివరాత్రికి సిద్ధమైంది. సముద్ర తీరాన ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా ఈ లింగాన్ని తీర్చిదిద్దారు. మెట్ల ద్వారా పైకి వెళ్లి అభిషేకం చేసే సౌకర్యం ఉండటంతో.. శివరాత్రి నాడు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. సముద్ర స్నానాలు ఆచరించి శివుడిని దర్శించుకునేందుకు పర్యాటకులు ఇక్కడకు ఆసక్తి చూపుతారు. ప్రకృతి ఒడిలో ఈ శివలింగం ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణ నిలవనుంది.