News January 21, 2026

హైదరాబాద్‌లోని IIMRలో ఉద్యోగాలు

image

<>HYD<<>>లోని ICAR-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ 7 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గలవారు FEB 3 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ( అగ్రికల్చర్ సైన్స్, లైఫ్ సైన్స్), PG( అగ్రికల్చర్ ఎకనామిక్స్/అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్/అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్& అల్లైడ్ సైన్స్) BE, BTech ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఫిబ్రవరి 5, 11 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

Similar News

News February 13, 2026

మంచిర్యాల కార్పొరేషన్‌లో కాంగ్రెస్ విజయం

image

TG: మంచిర్యాల కార్పొరేషన్‌‌ను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 60 డివిజన్లలో 45 స్థానాలను సొంతం చేసుకుంది. BRS 5, BJP ఒక డివిజన్‌లో గెలుపొందాయి. అటు నల్గొండ, మహబూబ్‌నగర్, రామగుండంలోనూ కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. కరీంనగర్, నిజామాబాద్‌లో బీజేపీ లీడ్‌లో ఉంది. BRS ఒక్క కార్పొరేషన్‌లోనూ సత్తా చాటలేకపోతోంది.

News February 13, 2026

శివ నామాలు అర్థాలు ‘‘నీల లోహిత’’

image

సృష్టి ఆరంభంలో బ్రహ్మ దేవుడి కోపం నుంచి శివుడు ఉద్భవించినప్పుడు ఆయన ‘నీల లోహిత’ రూపంలో ఉన్నాడు. ‘నీల’ అంటే ఆకాశం అంతటి నీలి రంగు, ‘లోహిత’ అంటే అగ్ని లాంటి ఎరుపు రంగు. అంటే సృష్టిలోని శాంతిని, అలాగే ప్రళయ కాలంలోని తీవ్రతను రెండింటినీ ఆయన తనలో కలిగి ఉంటారని దీని అర్థం. అర్ధనారీశ్వర రూపానికి ఇది మరో సంకేతం. నీలం రంగు జ్ఞానానికి చిహ్నం అయితే, ఎరుపు రంగు శక్తికి, క్రియాశీలతకు నిదర్శనం.

News February 13, 2026

పత్తి పంట తీసిన తర్వాత ఏం చేయాలి?

image

పత్తి తీత పూర్తయ్యాక తప్పనిసరిగా పంట విరామం పాటించాలి. ఈ సమయంలో పక్షులు వాలేలా Y ఆకారపు చెట్ల కొమ్మలను భూమిలో పాతి ఉంచడం వల్ల అవి పంటలకు సహజ శత్రువులైన పురుగులను తినే అవకాశం ఉంటుంది. పంట కోత తర్వాత పొలంలో తడి లేకుండా చూడాలి. లేకుంటే కింద పడిన కాయల్లో పురుగుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉంటుంది. పత్తితీత తర్వాత పొలాల చుట్టూ ఉన్న రోడ్లు, కాలువ గట్లు, పొలాల అంచుల్లో పత్తి మొక్కలను పూర్తిగా తొలగించాలి.