News April 26, 2024
మంత్రి కొండాకు ఈసీ నోటీసులు

TG: మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఇటీవల కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెపై బీఆర్ఎస్ ఈసీకి ఫిర్యాదు చేసింది. దీంతో ఈసీ ఆమెకు నోటీసులు ఇచ్చింది. ఎన్నికల వేళ జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. స్టార్ క్యాంపెయినర్‌గా, మంత్రిగా మరింత బాధ్యతాయుతంగా ఉండాలని పేర్కొంది.
Similar News
News January 25, 2026
పోలవరం నిర్వాసితులకు పరిహారం ఎప్పుడంటే?

AP: పోలవరం ప్రాజెక్ట్ ఫస్ట్ ఫేజ్ నిర్వాసితులకు జూన్‌లోగా పరిహారం ఇవ్వాలని జలవనరుల శాఖ నిర్ణయించింది. మొత్తం 21,709 కుటుంబాలకు పరిహారం అందజేసేందుకు రూ.2,497.98 కోట్లు అవసరం అని అంచనా వేసింది. 2027 మార్చి నాటికి ప్రాజెక్టు తొలిదశ పనులను, ఈ ఏడాది డిసెంబర్‌లోగా పునరావాస కాలనీల నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు 28 కాలనీలు పూర్తవగా మరో 49 కాలనీల పనులు పూర్తి కావాల్సి ఉంది.
News January 25, 2026
రథ సప్తమి గురించి ‘యోగశాస్త్రం’ ఏం చెబుతుందంటే..?

యోగశాస్త్రం ప్రకారం మన శరీరంలో ఇడా, పింగళ అనే 2 నాడులుంటాయి. ఇందులో పింగళ నాడి సూర్య నాడికి సంకేతం. ప్రాణాయామం ద్వారా ఈ నాడులను శుద్ధి చేసినప్పుడు కుండలినీ శక్తి మేల్కొంటుంది. సూర్యుడు బాహ్య ప్రపంచానికి వెలుగునిస్తే, యోగ సాధన ద్వారా మనలోని చిదాత్మ ప్రకాశిస్తాడు. రథసప్తమి నాడు చేసే సాధన మనలోని ఈ అంతర్గత శక్తిని మేల్కొల్పుతుంది. అందుకే ఈ పర్వదినాన కొద్దిసేపైనా యోగా చేయాలని పండితులు సూచిస్తారు.
News January 25, 2026
నేడే మూడో టీ20.. గెలిస్తే భారత్‌దే సిరీస్

భారత్, న్యూజిలాండ్ మధ్య ఈరోజు గువాహటిలో 3rd T20 జరగనుంది. ఇప్పటికే తొలి 2 మ్యాచులు గెలిచిన IND ఇందులోనూ గెలిస్తే సిరీస్ సొంతం చేసుకుంటుంది. అక్షర్, బుమ్రా తిరిగి తుది జట్టులోకి వచ్చే అవకాశముంది. మరోసారి 200+ స్కోర్ నమోదవ్వొచ్చని అంచనా.
IND XI (అంచనా): అభిషేక్, శాంసన్, ఇషాన్, సూర్య, హార్దిక్, దూబే, రింకూ, అక్షర్/కుల్దీప్, బుమ్రా/హర్షిత్, అర్ష్‌దీప్, వరుణ్
LIVE: 7PM నుంచి Star Sports, Hotstar


