News January 21, 2026
నల్గొండ: దివ్యాంగులకు గుడ్ న్యూస్.. 30 లాస్ట్ డేట్

దివ్యాంగులు వారికి అవసరమైన ఉపకరణాల కోసం ఈ నెల 30లోగా tso bmms.cgg.gov.in ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి తెలిపారు. 100 శాతం సబ్సిడీతో అర్హులైన దివ్యాంగులకు మొబైల్ బిజినెస్ బ్యాటరీ సైకిల్, ట్యాప్టాప్, ట్యాబ్స్, మూడు చక్రాల రిక్షాలు, వీల్ చైర్స్, చంక కర్రలు, హియరింగ్ ఎయిడ్స్, వాకింగ్ స్టిక్స్ తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ అందజేస్తుందని తెలిపారు.
Similar News
News February 10, 2026
నల్గొండ: పుర పోరులో.. పెరిగిన ఓటు విలువ!

మున్సిపల్ ఎన్నికల్లో ప్రచార పర్వం ముగియడంతో తాయిలాల పంపిణీకి తెరలేచింది. అభ్యర్థులు ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో రూ.లక్షలు కుమ్మరిస్తుండడంతో ఓటు విలువ పెరిగింది. జిల్లాలో నల్గొండ కార్పొరేషన్ సహా మిర్యాలగూడ, హాలియా, చండూర్, దేవరకొండ, చిట్యాల, నందికొండ మున్సిపాల్టీల్లో భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. నల్గొండలో ఒక్కో డివిజన్‌లో రూ.50 లక్షల పైగానే డబ్బు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం.
News February 10, 2026
ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు సహకరించాలి: నల్గొండ ఎస్పీ

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం అత్యంత అప్రమత్తమైంది. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన నాకాబందీ చేపట్టారు. 48 గంటల ‘మౌన కాలం’ అమల్లోకి రావడంతో ప్రచారాలు, సభలపై నిషేధం విధించారు. సెక్షన్ 163 అమలు చేస్తూ అక్రమ నగదు, మద్యం తరలింపుపై ప్రత్యేక నిఘా ఉంచారు. ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని ఎస్పీ కోరారు.
News February 9, 2026
NLG: మున్సిపల్ పోలింగ్.. రెండు రోజులు సెలవులు: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని ఆయా మున్సిపాలిటీల పరిధిలోని అన్ని విద్యాసంస్థలకు ఈ నెల 10, 11 తేదీల్లో రెండు రోజుల పాటు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి. చంద్రశేఖర్ తెలిపారు. ఈ ఉత్తర్వులు నల్గొండ కార్పొరేషన్, మిర్యాలగూడ, హాలియా, నందికొండ, చండూరు, దేవరకొండ, చిట్యాల మున్సిపాలిటీలకు వర్తిస్తాయని పేర్కొన్నారు.


