News January 21, 2026

MHBD: నేటి నుంచి జంతుగణన!

image

జిల్లాలో జంతు సంపాదన శాస్త్రీయంగా అంచనా వేసే దిశగా అటవీ శాఖ బుధవారం నుంచి శ్రీకారం చుట్టనుంది. జిల్లా అటవీ శాఖ అధికారి విశాల్ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని అటవీ రేంజ్ పరిధిలో గణన ప్రారంభం కానుంది. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి నిర్వహించే ఈ జంతువుల లెక్కింపు కార్యక్రమం ఈసారి నూతన AI టెక్నాలజీతో పాటు, జీపీఎస్ ట్రాకింగ్, డ్రోన్ విధానాలను వినియోగించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Similar News

News February 16, 2026

విశ్వక్‌కు వరుస షాక్‌లు.. రూటు మార్చాల్సిందేనా?

image

ENE, ఫలక్‌నుమాదాస్ లాంటి సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్న విశ్వక్‌సేన్‌కు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. చాలా కాలంగా హిట్‌కు దూరమైన ఆయనకు తాజాగా రిలీజైన ‘ఫంకీ’ కూడా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. అంతకుముందు ‘లైలా’, ‘మెకానిక్ రాకీ’ కూడా ఫెయిలయ్యాయి. దీంతో విశ్వక్‌ సరైన కథలను ఎంపిక చేసుకోవట్లేదన్న విమర్శలొస్తున్నాయి. ప్రస్తుతం చేస్తున్న ‘ENE2’, ‘కల్ట్’ సినిమాలైనా ఆయనకు హిట్ ఇస్తాయేమో చూడాలి.

News February 16, 2026

మెట్‌పల్లి: క్రాస్ ఓటింగ్.. BJP కౌన్సిలర్‌ సస్పెండ్

image

మెట్‌పల్లి పుర ఎన్నికల్లో పార్టీ విప్‌ను ధిక్కరించి కాంగ్రెస్‌కు ఓటు వేసిన కౌన్సిలర్ చెట్లపల్లి మీనాపై BJP క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఆమెకు సహకరించిన కౌన్సిలర్ భర్త, కోరుట్ల నియోజకవర్గ బీజేపీ ఇన్‌ఛార్జ్ చెట్లపల్లి సుఖేందర్‌ను కూడా పార్టీ శాసన ఉల్లంఘనకు బాధ్యులుగా గుర్తించింది. ఇద్దరినీ 6 సంవత్సరాలపాటు సస్పెండ్ చేస్తున్నట్లు BJP రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ కన్వీనర్ రవీందర్ విశ్వనాథ్ ప్రకటించారు.

News February 16, 2026

చిత్తూరు SP పరిష్కార వేధికకు 36 అర్జీలు

image

చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో SP తుషార్ డూడీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారవేదిక కార్యక్రమం సోమవారం జరిగింది. కాగా బాధితుల నుంచి ఎస్పీ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 36 ఫిర్యాదులు అందినట్టు వెల్లడించారు. ఇందులో అత్యధికంగా నగదు లావాదేవీలు 6, ఆస్తి తగాదాలు 6, భూతగాదాల ఫిర్యాదులు 17 అందాయన్నారు. వీటిని సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.