News January 21, 2026

TTD చరిత్రలో మొట్టమొదటిసారిగా.!

image

ఓ రిటైర్డ్ IAS అధికారిని TTD తొలిసారిగా జేఈవోగా నియమించడం చర్చనీయాంశమైంది. టీటీడీ జేఈవో(హెల్త్ అండ్ ఎడ్యుకేషన్)గా డాక్టర్ ఏ.శరత్ నియమితులైన విషయం తెలిసిందే. ఈయన 2005 బ్యాచ్‌ IAS అధికారి. రిటైర్డ్ అయిన వారి సేవలు కావాలంటే ప్రత్యేకాధికారిగా, సలహాదారులుగా, కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్ కింద ఇప్పటి వరకు నియమిస్తున్నారు. అయితే నూతన జేఈవో నియామకంపై ఉద్యోగులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట.

Similar News

News February 4, 2026

కామారెడ్డి మున్సిపల్ ఎన్నికలు త్రిముఖ వ్యూహమే!

image

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ ఎన్నికలు త్రిముఖ వ్యూహంగానే కనిపిస్తున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్, BRS, BJPల మధ్య పోటీ ఉండనుంది. అత్యధికంగా 3, 4వ వార్డుల్లో ఏకంగా 10 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 31వ వార్డులో 9 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా మిగతా అన్ని వార్డుల్లో ఐదుగురు బరిలో ఉన్నారు. ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ కోసం BJP వ్యూహం రచించగా, అధికారం కోల్పోయిన BRS ప్రయత్నాలు కొనసాగిస్తుంది.

News February 4, 2026

భార్య అందంగా ఉందని గుండు గీశాడు

image

కర్ణాటలోని బాగల్‌కోట(D)లో అమానవీయ ఘటన జరిగింది. అందంగా ఉన్న తన భార్యను ఇతర పురుషులు చూస్తారని భర్త ఉమేశ్ అనుమానం పెంచుకున్నాడు. ఆమె జుట్టు పొడుగ్గా ఉందని, అందంగా పూలతో అలంకరించుకుంటూ యువకులను వలలో వేసుకుంటోందని అతను భావించాడు. రాత్రి ఫుల్లుగా తాగి భార్యను కత్తితో బెదిరించి గుండు చేశాడు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

News February 4, 2026

HIVతో ఐదేళ్లలో 44వేల మంది బలి

image

రెండు తెలుగు రాష్ట్రాల్లో 2020-24 మధ్య ఐదేళ్లలో 44,140మంది బాధితులు మరణించారని కేంద్రం తెలిపింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి అనుప్రియ పటేల్‌ రాజ్యసభలో ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఏపీలో 32,642 మంది, తెలంగాణలో 11,498 మంది HIV బాధితులు మరణించారని వెల్లడించారు. ప్రజల్లో పెరిగిన నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం దీనికి కారణమని తెలుస్తోంది.