News January 21, 2026

ఎంపీ మల్లు రవి క్షమాపణ చెప్పాలి: కేటీఆర్

image

TG: ఎంపీ మల్లు రవి, అలంపూర్ MLA విజయుడు మధ్య <<18912878>>వాగ్వాదంపై<<>> KTR ఫైరయ్యారు. ఎమ్మెల్యేపై ఎంపీ చేయి చేసుకోవడం ప్రజాస్వామ్యంపై జరిగిన బహిరంగ దాడి అని Xలో పేర్కొన్నారు. ప్రతిపక్షాన్ని భయపెట్టేందుకు, గొంతు నొక్కేందుకు కాంగ్రెస్ నేతల దిగజారుడుతనానికి ఇది నిదర్శనమని దుయ్యబట్టారు. దాడిని ఖండిస్తూ, మల్లు రవి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. CM రేవంత్ నైతిక బాధ్యత వహించి ఆయనపై చర్యలు తీసుకోవాలన్నారు.

Similar News

News February 20, 2026

ఏఐ ఎఫెక్ట్.. రోజుకు 6లక్షల కిలోవాట్ అవర్ల విద్యుత్ ఖర్చు!

image

ఏఐ వాడకం వల్ల ఆ ఎఫెక్ట్ విద్యుత్, నీటిపై పడుతోంది. ఒక ప్రాంప్ట్ కోసం 0.34 వాట్ అవర్స్ విద్యుత్ అవసరమవుతోంది. ఒక యూజర్ ఏఐ వాడకంతో రోజుకు సగటున 6.8 వాట్స్ అవర్స్ విద్యుత్ ఖర్చు అవుతోందట. ఇక 100 మిలియన్ యూజర్లకు 6.8లక్షల kWh ఖర్చవుతోందట. ఇక ఏఐ డేటా సెంటర్ల నిర్వహణ కోసం నీటిని భారీగా వినియోగిస్తున్నారు. 2023లో 6.1 బిలియన్ గ్యాలన్ల మంచినీటిని ఉపయోగించినట్లు గతంలో గూగుల్ ఇచ్చిన రిపోర్ట్ చెబుతోంది.

News February 20, 2026

ఆయేషా మీరా హత్య కేసులో కీలక ఆదేశాలు

image

AP: ఆయేషా మీరా హత్య కేసులో వైద్య బృందం సేకరించిన అవశేషాలను ఆమె తల్లిదండ్రులకు అప్పగించాలని VJA సీబీఐ కోర్టు పేర్కొంది. FEB 27న తెనాలిలో మతపరమైన ఆచారాలతో అంత్యక్రియలు చేయాలని, అందుకు వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రీపోస్ట్‌మార్టం కోసం 2019లో తెనాలి కబరిస్తాన్ నుంచి ఆయేషా అవశేషాలను సేకరించారు. 2007లో విజయవాడ శివార్లలోని ఓ బీఫార్మసీ కాలేజ్ హాస్టల్లో ఆయేషా హత్యకు గురైన విషయం తెలిసిందే.

News February 20, 2026

ట్రంప్ టారిఫ్స్ దందా రివర్స్.. మన పరిస్థితి ఏంటి?

image

US అధ్యక్షుడు ట్రంప్ ఇన్నాళ్లూ ఆడిన టారిఫ్ గేమ్‌కు ఆ దేశ సుప్రీంకోర్టు తీర్పుతో చెక్ పడినట్లు అయింది. అయితే టారిఫ్స్‌కు బెదిరి డీల్స్ కుదుర్చుకున్న దేశాల పరిస్థితి ఏంటనేది చర్చనీయాంశమైంది. భారత్ కూడా ఇటీవల డీల్ కుదుర్చుకుంది. మరి సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం ఆ ట్రేడ్ డీల్‌పై పడుతుందా అనేది బిగ్ క్వశ్చన్. మారిన పరిణామాల నేపథ్యంలో భారత్ ఈ డీల్‌పై వెనక్కి తగ్గే అవకాశం ఉందా? అనేది తెలియాల్సి ఉంది.