News January 21, 2026
మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు: కవిత

TG: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రకటించారు. ఏ పార్టీకి మద్దతు కావాలంటే ఆ పార్టీకి తెలంగాణ జాగృతి సపోర్ట్ చేస్తుందని తెలిపారు. కాగా కవిత కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ ప్రక్రియకు మరింత సమయం పట్టే ఛాన్స్ ఉండటంతో పోటీకి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అటు ఏ క్షణమైనా మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.
Similar News
News February 2, 2026
నిన్న ఢమాల్.. నేడు కమాల్

స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 943 పాయింట్ల లాభంతో 81,666కు చేరగా నిఫ్టీ 262 పాయింట్లు ఎగిసి మళ్లీ 25వేల మార్క్‌కు చేరుకుంది. నిన్నటి సెషన్‌లో భారీ అమ్మకాలు జరగగా ఈరోజు కొనుగోళ్లు నమోదయ్యాయి. ముడి చమురు ధరలు తగ్గడం, బడ్జెట్‌లో డేటా సెంటర్లకు పన్ను మినహాయింపు వంటి ప్రకటనలు, రూపీ కోలుకోవడం మార్కెట్లకు కలిసొచ్చింది. సెన్సెక్స్ 30లో పవర్‌గ్రిడ్ 7.55% లాభంతో టాప్ గెయినర్‌గా ఉంది.
News February 2, 2026
జైలర్-2లో షారుఖ్ పాత్ర అదేనా?

సూపర్ స్టార్ రజినీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న జైలర్-2 గురించి వస్తున్న వార్తలు ప్రస్తుతం సినీ వర్గాల్లో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. ముంబయిలో జరిగే నెక్ట్స్ షెడ్యూల్‌లో షారుఖ్‌పై సీన్లు చిత్రీకరిస్తారని తెలుస్తోంది. ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ కేవలం అతిథి పాత్రకే పరిమితం కాకుండా, కథను మలుపు తిప్పే ఒక పవర్‌ఫుల్ రోల్‌లో కనిపిస్తారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
News February 2, 2026
రూపీకి రిలీఫ్.. డాలర్ దెబ్బ నుంచి కోలుకుంది

గత కొన్నిరోజులుగా క్షీణిస్తున్న రూపాయికి ఈరోజు ఊరట లభించింది. RBI జోక్యం చేసుకోవడంతో 42 పైసలు పెరిగింది. ఆరు వారాల తర్వాత మళ్లీ ఒక రోజులో ఆ స్థాయి గెయిన్స్ నమోదు కావడం ఇదే తొలిసారి. ప్రస్తుతం రూపాయి విలువ ఒక డాలరుకు 91.53గా ఉంది. RBI సూచన మేరకు ప్రభుత్వ రంగ బ్యాంకులు డాలర్లను విక్రయించడంతో రూపాయి తేరుకుంది.


