News January 21, 2026

ట్రంప్ దెబ్బ.. ప్రపంచ స్టాక్ మార్కెట్లూ పతనం

image

US అధ్యక్షుడు ట్రంప్ దెబ్బకు గ్లోబల్ స్టాక్ మార్కెట్లూ భారీగా పతనమవుతున్నాయి. USకు చెందిన Dow 870(1.76%) పాయింట్లు, S&P 143(2%), Nasdaq 561(2.39%) పాయింట్లు నష్టపోయాయి. దీంతో నేడు నిక్కీ 283(0.53%-జపాన్‌), DAX 255(1%-జర్మనీ), తైవాన్ మార్కెట్లు 510(1.62%) పాయింట్లు కోల్పోయాయి. గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ కాలుదువ్వడం, టారిఫ్స్, ట్రేడ్ వార్ భయాలతో ప్రపంచ మార్కెట్లు నష్టాలు ఎదుర్కొంటున్నాయి.

Similar News

News February 14, 2026

ఈ నెల 19 నుంచి పెళ్లి ముహూర్తాలు మొదలు

image

తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సందడి నెలకొననుంది. ఈ నెల 17తో శుక్ర మౌఢ్యమి ముగియడంతో 19 నుంచి పెళ్లి ముహూర్తాలు మొదలుకానున్నట్లు పండితులు తెలిపారు. *ఫిబ్రవరి: 19, 20, 21, 24, 25, 26 *మార్చి: 1, 3, 4, 7, 8, 9, 11, 12 *ఏప్రిల్: 15, 20, 21, 25, 26, 27, 28, 29 *మే: 1, 3, 5, 6, 7, 8, 13, 14 *జూన్: 21, 22, 23, 24, 25, 26, 27, 29 *జులై: 1, 6, 7, 11 *నవంబర్: 21, 24, 25, 26 *డిసెంబర్: 2, 3, 4, 5, 6, 11, 12.

News February 14, 2026

రిటైర్మెంట్ లైఫ్ ఫుల్ సేఫ్.. పెన్షన్‌ + హెల్త్ కవర్‌కు PFRDA ప్లాన్!

image

ఇకపై పెన్షన్ స్కీమ్స్‌తో పాటే హెల్త్ కవర్‌నూ అందించేందుకు PFRDA ప్లాన్ చేస్తోంది. రిటైర్మెంట్ తర్వాత వైద్య ఖర్చుల కోసం ఇబ్బంది లేకుండా ఇన్వెస్టర్ల డబ్బులో 30% వైద్య అవసరాలకు కేటాయించేలా ‘Swasthya’ ప్లాన్‌ను రూపొందించే యోచనలో ఉంది. పెన్షన్ ఫండ్స్ స్పాన్సర్ చేసే ICICI, Axis, Tata వంటివి దీనిపై కసరత్తు చేస్తున్నాయి. దీంతో తక్కువ ప్రీమియంతోనే ఇన్సూరెన్స్, హాస్పిటల్స్‌లో మంచి డిస్కౌంట్లు లభిస్తాయి.

News February 14, 2026

పంటను బట్టి యూరియా వాడితే మంచిది

image

మొక్కల ఎదుగుదలకు అవసరమైన నత్రజనిని అందించే యూరియాను పంటను బట్టి ఉపయోగించాలి. వరి పంటకు యూరియాను బురద పదునులో వేయాలి. పెద్ద గుళికల యూరియాను వరి పైరుకు వేస్తే నత్రజని లభ్యత ఎక్కువ రోజులు ఉంటుంది. ఆరుతడి పైర్లకు యూరియాను భూమిపైన కాకుండా మొక్కల దగ్గర గుంత తీసి అందులో వేసి మట్టితో కప్పివేయాలి. ఆరుతడి పంటలకు సన్నగుళికల యూరియా వేస్తే తేమ తక్కువగా ఉన్నా, తొందరగా కరిగి మొక్కకు అందుతుంది.