News January 21, 2026
HYD: బెస్ట్ రీల్‌కు రూ.10,000

హైదరాబాద్‌కు 150 కిలోమీటర్ల మేర ఉన్న 500లకు పైగా వీకెండ్ స్పాట్స్ ఇప్పుడు మీ కెమెరా కోసం వెయిట్ చేస్తున్నాయి. FTCCI నిర్వహిస్తున్న ఈ మెగా రీల్స్ కాంటెస్ట్ గడువును ఫిబ్రవరి 15 వరకు పొడిగించారు. పాత కోటలు, జలపాతాలు, ఫేమస్ దాబాల అందాలను 60 సెకన్ల వీడియోలో బంధించండి. బెస్ట్ రీల్స్‌కు రూ.10,000 వరకు నగదు బహుమతులతో పాటు క్రేజీ గుర్తింపు పొందే ఛాన్స్! తెలంగాణ టూరిజాన్ని మీ స్టైల్‌లో వైరల్ చేయండి.
Similar News
News February 2, 2026
HYDలో మళ్లీ పెరిగిన ఎయిర్ పొల్యూషన్ @318

HYDలో ఎయిర్ క్వాలిటీలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. సాధరణంగా పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల పొగతో కాలుష్యం పెరుగుతుంటుంది. డబుల్ డిజిట్‌లో ఉండే ఎయిర్ క్వాలిటీ సోమవారం తెల్లవారుజామున సోమాజిగూడలోని టీచర్స్ కాలనీలో 318గా రికార్డ్ అయ్యింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారితో పాటు ప్రజలు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు.
News February 2, 2026
HYD: భార్య ఆత్మహత్య బెదిరింపు.. స్టూల్ తన్నేసిన భర్త!

క్షణికావేశం, మద్యం మత్తు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఫిలింనగర్‌కు చెందిన కొండల్ శనివారం రాత్రి మద్యం తాగి వచ్చి భార్య అరుణతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో తనను బెదిరించేందుకు అరుణ స్టూల్‌పై ఎక్కి ఉరి వేసుకోబోగా, ఆగ్రహంతో ఉన్న కొండల్ స్టూల్‌ను కాలితో తన్నేశాడు. దీంతో ఆమె ఊపిరాడక ప్రాణాలు విడిచింది. కుమారుడు ఇచ్చిన సాక్ష్యంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
News February 2, 2026
HYD: వంటరితనమే ఆ కుటుంబాన్ని కబళించిందా..?

చర్లపల్లి వద్ద రైలుకింద పడి <<19011053>>తల్లి, పిల్లలు సూసైడ్<<>> చేసుకున్న విషయం తెలిసిందే. భర్త సురేందర్ ఉద్యోగ రీత్యా దుబాయ్‌లో ఉండగా మృతురాలు విజయ IT కంపెనీలో టీమ్‌లీడర్. పిల్లలు హాస్టల్‌లో ఉంటున్నారు. ఒంటరితనం పీడిస్తోందని బందువులతో చెప్పి, సూసైడ్ నోట్ రాసి తన కారులో పెట్టి, వాట్సప్ స్టేటస్‌గా కూడా సూసైడ్ లెటర్ పెట్టినట్లు సమాచారం. సూసైడ్‌కు కారణం ఒంటరితనమా, మరేదైనా కారణమా అన్నది తెలియాల్సి ఉంది.


