News January 21, 2026

ఖమ్మం: హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం: తక్కలపల్లి

image

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. బుధవారం ఖమ్మంలోని సప్తపది ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన సీపీఐ జాతీయ సమితి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

Similar News

News February 20, 2026

NZB: నేడు బాధ్యతలు స్వీకరించనున్న మేయర్

image

నిజామాబాద్ నగర మేయర్‌గా ఇటీవల ఎన్నికైన కూరగాయల ఉమారాణి శుక్రవారం ఉదయం 11.30 గంటలకు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారని నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తెలిపారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించనున్న కార్యక్రమానికి కార్పొరేటర్లు విచ్చేయాలని కమిషనర్ కోరారు.

News February 20, 2026

HYD: 60% వరకు రాయితీతో బైకులు

image

PM మత్స్య సంపద యోజన కింద HYD జిల్లాలో అర్హతగల మత్స్యకారులకు 16 బైకులు (ఐస్ బాక్స్‌తో) మంజూరు చేసినట్లు జిల్లా మత్స్యశాఖాధికారి రజిని తెలిపారు. ఒక్క యూనిట్ విలువ రూ.75,000 అని స్పష్టంచేశారు. జనరల్‌, SC/STలకు 40% (రూ.30వేలు), మహిళలకు 60% (రూ.45వేలు) రాయితీ ఉంటుంది. చేపల అమ్మకంలో అనుభవం, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. ఆసక్తిగల వారు ఫిబ్రవరి 26లోగా మాసబ్‌ట్యాంక్‌ మత్స్యభవన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.