News January 21, 2026
మెదక్: ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై దాడి చేయడమే ప్రజాపాలనా? హరీష్ రావు

అలంపూర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే విజయుడిపై నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి దాడిని మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. విజయుడిపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి దుర్భాషలాడుతూ చేయి చేసుకోవడం దారుణమన్నారు. అప్రజాస్వామికమని విమర్శించారు. ప్రజల చేత ఎన్నిక కాబడిన ప్రతినిధిపై దాడి అంటే ప్రజల తీర్పుపైనే దాడి అని స్పష్టం చేశారు. విజయుడిపై ఎంపీ మల్లు రవి దాడిని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.
Similar News
News February 11, 2026
మెదక్: ‘మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పక్రియ ప్రశాంతం’

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పక్రియ ప్రశాంతంగా జరుగుతున్నట్లు సాధారణ పరిశీలకులు రవి కిరణ్ తెలిపారు. మున్సిపల్ పరిధిలో ఉన్న పలు వార్డులలో, పోలింగ్ కేంద్రాలలో విస్తృతంగా పర్యటించి పరిశీలించారు. పోలింగ్ సిబ్బందిని, పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటర్లను ఓటింగ్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటూ తెలుసుకున్నారు. మెదక్ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు. అదనపు కలెక్టర్ నగేశ్, ఆర్డీవో రమాదేవి ఉన్నారు.
News February 11, 2026
నర్సాపూర్: ఓటు కేవలం హక్కు కాదు.. బాధ్యత!

పురపాలక ఎన్నికల సందర్భంగా నర్సాపూర్‌కు చెందిన నవీన్-దివ్య దంపతులు తమ పసిపిల్లలతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓటు వేయడం కేవలం హక్కు మాత్రమే కాదని, ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాలకు వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లులు సైతం వచ్చి ఓటు వేయడం ఆదర్శనీయమని, సమయం ఉండి ఓటు వేయని వారు వీరిని చూసి మారాలని పలువురు అంటున్నారు.
News February 11, 2026
ఎన్నికల సరళిని పర్యవేక్షిస్తున్న కలెక్టర్

మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సరళిని కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్ కలెక్టరేట్‌లోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోందని, అధికారులు క్షేత్రస్థాయి సమాచారాన్ని నిరంతరం సేకరిస్తున్నారని వివరించారు. ఓటర్లు స్వేచ్ఛగా వచ్చి ఓటు వేయాలన్నారు.


