News January 21, 2026

ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

<>ఇంజినీర్స్<<>> ఇండియా లిమిటెడ్‌ 9 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 4 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి PG(సోషల్ వర్క్, సోషియాలజీ, ఎకనామిక్స్, సోషల్ సైన్సెస్), MBA, BE/BTech, BSc, CA/CMA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ/ స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://recruitment.eil.co.in

Similar News

News February 20, 2026

‘చేతకాకుంటే చెప్పండి’.. పోలీసుల తీరుపై సుప్రీం ఫైర్

image

AP: MLC అనంతబాబు డ్రైవర్ హత్యకేసులో పోలీసుల తీరుపై SC ఆగ్రహం వ్యక్తం చేసింది. వారికి చేతకాకుంటే CBIకి అప్పగిస్తామని స్పష్టం చేసింది. దర్యాప్తులో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తూ సాగదీస్తున్నారని మండిపడింది. అభియోగాలపై ఏప్రిల్ 18లోపు నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. నవంబర్ 30లోపు ట్రయల్ పూర్తిచేయాలని స్పష్టం చేసింది. అప్పటివరకు అనంతబాబు బెయిల్‌ను పొడిగిస్తున్నట్లు పేర్కొంది.

News February 20, 2026

బెండలో నీటి యాజమాన్యం, కలుపు నివారణ

image

బెండ విత్తనాలు విత్తిన వెంటనే నీరు పెట్టాలి. నల్లరేగడి నేలల్లో అయితే ప్రతి ఐదారు రోజులకు నీరు అందించాలి. పూత, కాయ దశల్లో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. నీటి లభ్యత బాగా తక్కువగా ఉంటే బిందుసేద్యం విధానం అనుసరించడం మంచిది. పంటకాలంలో 3 నుంచి నాలుగుసార్లు కలుపు తీయాల్సి ఉంటుంది. విత్తనాలు వేసిన 2 వారాలకు కలుపు నియంత్రణ చర్యలు చేపట్టాలి. తర్వాత సమస్యను బట్టి కలుపును తొలగించుకోవాలి.

News February 20, 2026

Stocks: నష్టాల్లోంచి లాభాల్లోకి..

image

నిన్నటి నష్టాలను కొనసాగిస్తూ ఇవాళ కూడా రెడ్‌లో మొదలైన స్టాక్ మార్కెట్లు తేరుకున్నాయి. వాల్యూ బయింగ్‌లో భాగంగా ఇన్వెస్టర్లు మెటల్, బ్యాంక్ స్టాక్స్‌పై పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో సెన్సెక్స్ క్రమంగా లాభాల్లోకి వచ్చి ప్రస్తుతం 400 పాయింట్లు గ్రీన్‌లో కొనసాగుతోంది. అటు నిఫ్టీ కూడా 143 పాయింట్లు లాభాల్లో ఉంది.