News January 21, 2026
BREAKING: కామారెడ్డి జిల్లాలో దారుణం

కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు కోతులకు మత్తుమందు ఇచ్చి చంపుతూ తమ గ్రామ శివారులో పడేస్తున్నారని బిక్కనూర్ మండలం అంతంపల్లి సర్పంచ్ మంజుల సంజీవరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.తమ గ్రామ శివారులోని హరియాణా దాబా ప్రాంతంలో సుమారు 10కోతులు చనిపోయి ఉన్నాయని,మరికొన్ని మత్తుమందుతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాయన్నారు. ఈవిషయాన్ని ఫారెస్ట్ అధికారులకు తెలిపితే తమకు సంబంధం లేదంటున్నారన్నారు.
Similar News
News February 5, 2026
పల్నాడు: అన్నదాతపై ఎరువుల భారం.. బస్తాకు రూ. 100 పెంపు!

పల్నాడు జిల్లా రైతులకు ఎరువుల ధరలు కన్నీరు తెప్పిస్తున్నాయి. రబీ సీజన్ ప్రారంభమయ్యాక రెండోసారి ధరలు పెరగడంతో సాగు ఖర్చు భారమైంది. ఒక్కో బస్తాపై రూ. 50 నుంచి రూ. 100 వరకు పెంచడంతో మొక్కజొన్న, మిర్చి, వరి సాగుచేస్తున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పెట్టుబడులు పెరిగి ఇబ్బందుల్లో ఉన్న తమను, ఈ అదనపు భారం మరింత కుంగదీస్తోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News February 5, 2026
ఫైబ్రోసిస్టిక్ బ్రెస్ట్ ఛేంజెస్ లక్షణాలు

ఫైబ్రోసిస్టిక్ బ్రెస్ట్ ఛేంజెస్ సమస్య ఉన్న మహిళల్లో రొమ్ము వాపులు, నొప్పి, రొమ్ముల్లో కణితులు, రొమ్ముల దగ్గర చర్మం రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మరికొందరు మహిళల్లో అయితే రొమ్ముల నుంచి ఆకుపచ్చ లేదా గోధుమ రంగు రక్తస్రావం కూడా జరుగుతుంది. ఇలా ఎక్కువగా జరుగుతున్నట్లయితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ వ్యాధిని నిర్ధారించడానికి డిజిటల్ మమోగ్రఫీ, అల్ట్రాసౌండ్ వంటి పరీక్షలు చేస్తారు.
News February 5, 2026
భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు

వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారికి గురువారం ప్రాతఃకాలంలో అర్చకులు విశేష పూజలు చేశారు. తెల్లవారుజామునే ఆలయ ద్వారాలు తెరిచి, అమ్మవారికి పంచామృతాలతో శాస్త్రోక్తంగా అభిషేకాలు జరిపారు. అనంతరం నూతన వస్త్రాలంకరణతో ప్రత్యేక అర్చనలు చేశారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని దర్శనం చేసుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేయగా, అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.


