News January 21, 2026

24న నగరికి సీఎం రాక

image

నగరిలో సీఎం చంద్రబాబు పర్యటన ఖరారైంది. స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈనెల 24న ఆయన నగరికి రానున్నారు. సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ వెంకటేశ్వర్లు, కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే భాను ప్రకాష్ హెలిప్యాడ్ స్థల పరిశీలన చేశారు. బహిరంగ సభ, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఉంటుందన్నారు.

Similar News

News January 25, 2026

చిత్తూరు: గురుకులాలు పిలుస్తున్నాయ్.!

image

పేద విద్యార్థుల విద్యాభ్యాసానికి అంబేడ్కర్ గురుకుల పాఠశాలలు అండగా నిలుస్తున్నాయి. జిల్లాలో బాయ్స్ కోసం రామకుప్పం, పూతలపట్టు, విజిలాపురం, గర్ల్స్ కోసం జీడీనెల్లూరు, చిత్తూరు, పలమనేరు, కుప్పం లో గురుకులాలు ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరంలో 5వ తరగతి, ఇంటర్మీడియట్ ఫస్టియర్‌లో చేరెందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హులైన విద్యార్థులు ఫిబ్రవరి 19 లోపు ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.

News January 25, 2026

చిత్తూరు జిల్లాలో 66 పశు వైద్య శిబిరాలు

image

జిల్లా వ్యాప్తంగా 66 పశువైద్య శిబిరాలు శనివారం నిర్వహించినట్లు జిల్లా పశువైద్యాధికారి ఉమామహేశ్వరి తెలిపారు. ఈ శిబిరాలను 2,276 మంది పాడి రైతులు సద్వినియోగం చేసుకున్నట్లు వెల్లడించారు. మొత్తం 7,505 పశువులకు వైద్యం అందించినట్లు వివరించారు. అలాగే గొర్రెలు, మేకలకు కూడా సేవలు అందించామన్నారు. ఇప్పటి వరకు మొత్తం 516 ఆరోగ్య శిబిరాలు నిర్వహించినట్లు తెలిపారు.

News January 25, 2026

చిత్తూరులో ప్లాస్టిక్ రీసైకిల్ ప్లాంట్

image

చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్లాస్టిక్ రీ సైకిల్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. శనివారం నగరిలో జరిగిన స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు సమక్షంలో చిత్తూరు నగరపాలక సంస్థ, జాగృతి టెక్ ప్రైవేటు లిమిటెడ్, వుయ్ కేర్ యూ ఫౌండేషన్ మధ్య ఒప్పందం కుదిరింది. రోజువారీగా ఉత్పత్తయ్యే సుమారు నాలుగు టన్నుల ప్లాస్టిక్ ను రీసైకిల్ చేసేందుకు ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు.