News January 21, 2026
మెదక్ జిల్లాలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు ప్రతిపాదనలు: కలెక్టర్

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల వేగవంతమైన పరిష్కారం కోసం జిల్లాలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీఓలు, డీఎస్పీలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Similar News
News January 31, 2026
తూప్రాన్: జనరల్ స్థానాల్లోనూ మహిళలు పోటీ

తూప్రాన్ మున్సిపల్ పరిధిలో 16 వార్డులకు జరుగుతున్న ఎన్నికల్లో జనరల్ స్థానాల్లోనూ మహిళలు నామినేషన్లు దాఖలు చేశారు. తూప్రాన్ మున్సిపాలిటీ పీఠం జనరల్(ఆన్ రిజర్వుడ్) మహిళకు కేటాయించారు. దాంతో ఛైర్ పర్సన్ పీఠం ఆశిస్తున్న చాలామంది ఆశావాహులు మహిళలతో నామినేషన్లు దాఖలు చేయించారు. తూప్రాన్ మున్సిపాలిటీలో 50 శాతమే మహిళలకు రిజర్వ్ చేసినప్పటికీ అత్యధికంగా మహిళలు గెలుపొందనున్నారు.
News January 30, 2026
సమయం లేదు..! నేడే నామినేషన్లకు ఆఖరి రోజు

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు నేటి సాయంత్రం 5 గంటలతో గడువు ముగియనుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇప్పటికే 70 శాతం అభ్యర్థులను ప్రకటించగా, మిగిలిన స్థానాల కోసం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఒక్కో వార్డులో ఇద్దరు ముగ్గురు పోటీ పడుతుండటంతో బీఫామ్ దక్కించుకునేందుకు అభ్యర్థులు పైస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. మెదక్ జిల్లాలో 312 నామినేషన్లు దాఖలయ్యాయి. గడువు ముగుస్తుండటంతో కార్యాలయాల వద్ద సందడి నెలకొంది.
News January 30, 2026
‘నర్సన్న రాయరావు’ పేరు మీదనే నర్సాపూర్

రాయరావు వంశానికి ఆద్యుడైన నర్సన్న రాయరావు పేరు మీదనే ఈ గ్రామానికి ‘నర్సాపూర్’ అనే పేరు వచ్చింది. గోల్కొండ సంస్థానంలో 16వ శతాబ్దంలో సేనాపతిగా, రాజకీయ సలహాదారుగా, అత్యున్నత పదవులు చేపట్టిన మొట్టమొదటిది నర్సన్న రాయరావు. ఆయన పరిపాలనలో ఈ ప్రాంత ప్రజల దాహార్తి తీర్చడానికి నీటి సరఫరా కోసం నిర్మించిన చెరువే ఇప్పటి రాయరావు చెరువు. యుద్ధ, రాజకీయ వ్యూహాల్లో మంచి అనుభవం గడించిన రాయరావులలో నర్సన్న మొదటి వారు.


