News January 21, 2026
పెద్దపల్లి: వేసవిలో నీటి ఎద్దడి రాకుండా చూడాలి: కలెక్టర్

పెద్దపల్లి జిల్లాలో రాబోయే వేసవిలో జిల్లాలో తాగునీటి ఎద్దడి కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో DWSM విభాగంపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రజలకు నీటి సమస్య రాకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. మిషన్ భగీరథ పనులను పర్యవేక్షిస్తూ, ప్రతి గ్రామానికి నీరు అందేలా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Similar News
News February 9, 2026
ఖమ్మం: ఎల్లుండే పోలింగ్.. మూతపడ్డ WINES

ఉమ్మడి ఖమ్మంలో మున్సిపాలిటీల ఎన్నికల ప్రచారం సా.5 గంటలకు ముగిసింది. ఎల్లుండి పోలింగ్ ఉండటంతో 48గంటల సైలెంట్ పీరియడ్ అమల్లోకి వచ్చింది. కాగా కాంగ్రెస్, BRS, BJP, CPI, CPM ఇతర పార్టీల నేతలు డోర్ టూ డోర్, బైక్ ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించి ఓటర్లను తమవైపుకు ఆకర్షించుకునేలా ప్రచారం చేశారు. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీల్లో ఇవాళ సా.5 నుంచి మద్యం దుకాణాలు మూతపడ్డాయి. ఎల్లుండి సా.5 తర్వాత తెరుచుకోనున్నాయి.
News February 9, 2026
జనగామ: పదో తరగతి విద్యార్థులకు కలెక్టర్ విజయోస్తు 2.0 లేఖ

జనగామ జిల్లాలోని పదో తరగతి విద్యార్థులకు కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ‘ విజయోస్తు 2.0 ‘ లేఖను అందజేస్తున్నారు. గతేడాది కూడా ఇదే తరహాలో ‘ విజయోస్తు ‘ లేఖలను అందించిన కలెక్టర్ పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో మూడో స్థానంలో నిలిచేలా కృషి చేశారు. ఈ ఏడాది మొదటి స్థానమే లక్ష్యంగా కలెక్టర్ విజయోస్తు 2.0 కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం జిల్లాలోని విజయవంతంగా కొనసాగుతోంది.
News February 9, 2026
ప్రెగ్నెన్సీలో ఐరన్ లెవల్స్ పెరగాలంటే?

ప్రెగ్నెన్సీలో ఐరన్ లెవల్స్ సరిగా లేకపోతే బిడ్డ ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే ఆహారంలో కొన్ని పదార్థాలు చేర్చుకోవాలంటున్నారు నిపుణులు. ఖర్జూరాలు, అంజీర్, బ్లాక్ రైజిన్స్, బీట్‌రూట్, ఉసిరి రసం, కొబ్బరి, బెల్లం లడ్డూలు, కొబ్బరినీరు, బాదంపప్పు, గుమ్మడిగింజలు, వేయించిన శనగలు, రాగులు, దానిమ్మగింజలు, పెసలు, నేరేడు పండ్లు డైట్‌లో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.


