News January 22, 2026
హనుమాన్‌పేట్‌లో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక

విజయవాడ హనుమాన్‌పేటలోని ఏపీలోని అన్ని జిల్లాల ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుల రాష్ట్ర కార్యవర్గ సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, అభివృద్ధి, విద్యార్థుల పౌరహక్కుల పరిరక్షణకు ప్రభుత్వంతో సమన్వయం చేస్తూ పనిచేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకోగా, రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీనివాసులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Similar News
News April 3, 2026
HYD: కల్తీ మామిడి పండ్లతో జాగ్రత్త: సీపీ సజ్జనార్

కల్తీ మామిడి పండ్లపై అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్ సూచించారు. రసాయనాలతో కృత్రిమంగా మగ్గించిన మామిడిని విక్రయిస్తున్న వ్యాపారులపై HYD పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నట్లు తెలిపారు. నిగనిగలాడుతున్నాయని చూసి మోసపోకుండా సహజత్వాన్ని గుర్తించి పండ్లను కొనుగోలు చేయాలని ప్రజలను కోరారు. కల్తీ మామిడి పండ్ల సమాచారం తెలిస్తే డయల్ 100, ఫోన్ నంబర్ 8712661212కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
News April 3, 2026
సంజూ శాంసన్‌ను చూసి నేర్చుకోండి: మోదీ

కేరళం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భారత క్రికెటర్ సంజూ శాంసన్‌పై PM మోదీ ప్రశంసలు కురిపించారు. ‘WC నాకౌట్‌లో సంజూ చెలరేగి ఆడారు. అతడి ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం మరింత బలపడ్డాయి. ఇవి నిజమైన క్రీడాకారుడి లక్షణాలు. జట్టుకు అవసరమైనప్పుడల్లా గొప్ప ఆటగాడు రాణిస్తాడు. అలానే ఓటింగ్ రోజున BJP కార్యకర్తలు ప్రతి ఇంటినీ చేరుకోవాలి. మీ అంకితభావం అత్యంత ముఖ్యం. విజయం కోసం అదనంగా పని చేయాలి’ అని పిలుపునిచ్చారు.
News April 3, 2026
వరంగల్‌లో అడ్డగోలుగా లింగ నిర్ధారణ పరీక్షలు!

వరంగల్ నగరంలో కొన్ని స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు అడ్డగోలుగా చేస్తున్నారు. హనుమకొండ(D) పున్నేలు స్విమ్మింగ్ పూల్‌లో ముగ్గురు ప్రాణాలను తీసిన ఘటన కలకలం రేపింది. అసలు ఫర్హానకు స్కానింగ్ చేసి చెప్పిందెవరనే కోణంలో పోలీసులు విచారణ చేయాలి. నాలుగు ప్రాణాలను తీసిన అనుమతి లేని స్విమ్మింగ్ ఫూల్ యజమానిపై, అడ్డగోలుగా వెలుస్తున్న రిసార్ట్‌లపై చర్యలు తీసుకోకపోతే మరిన్ని ఘోరాలు జరిగే అవకాశముంది.


