News April 27, 2024

ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించాలి: ఎన్నికల సాధారణ పరిశీలకులు

image

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలని జిల్లాఎన్నికల సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మానిక్ రావు సూర్యవంశీ కోరారు. శుక్రవారం కలెక్టరేట్లో అన్ని రాజకీయపార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితా అన్ని పార్టీలకు అందిందా?ఏవైనా సమస్యలు ఉన్నాయా?ఎన్నికల ప్రవర్తనా నియమాలను పాటిస్తున్నారా?అని అడిగి తెలుసుకున్నారు.

Similar News

News November 14, 2025

NLG: 17 నుంచి పత్తి కొనుగోలు బంద్

image

సీసీఐ తీరుపై మరోసారి కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతులతోపాటు కాటన్ మిల్లులను ఇబ్బందులకు గురిచేసేలా పత్తి కొనుగోళ్లల్లో కఠిన నిబంధనలను సడలించాలన్న విజ్ఞప్తిని సీసీఐ పట్టించుకోకపోవడంతో మరోసారి ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈనెల 17వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్లు కాటన్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రకటించింది.

News November 14, 2025

NLG: యాసంగి ప్రణాళిక@6,57,229 ఎకరాలు

image

యాసంగి సాగు ప్రణాళికను NLG జిల్లా వ్యవసాయ శాఖ ఖరారు చేసింది. గత యాసంగి సీజన్ లో వరి, ఇతర పంటలు కలిపి 6,49,712 ఎకరాల్లో రైతులు సాగు చేయగా.. ప్రస్తుత యాసంగి సీజన్‌లో 6,57,229 ఎకరాల్లో సాగు కానున్నట్లు వ్యవసాయశాఖ అంచనాలు వేసింది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రణాళికలను రూపొందించినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పాల్వాయి శ్రవణ్ కుమార్ తెలిపారు.

News November 13, 2025

విద్యార్థులను చూసి చలించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

image

మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం వద్ద ఆటోలో ప్రమాదకర స్థితిలో వెళ్తున్న మోడల్ స్కూల్ విద్యార్థులను చూసి చలించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆటోను ఆపి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల సమయానికి ప్రత్యేక బస్సును ఏర్పాటు చేయాలని మిర్యాలగూడ ఆర్టీసీ డిపో అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఎమ్మెల్యే స్పందన పట్ల స్థానిక ప్రజలు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.