News January 22, 2026
మేడారం సమ్మక్క తల్లి అత్తగారిల్లు మహబూబాబాద్ జిల్లాలోనే!

మేడారం సమ్మక్క తల్లి అత్తగారిల్లు మహబూబాబాద్ జిల్లాలోనే ఉంది. మేడారం జాతరకు వెళ్లేందుకు పగిడిద్దరాజు ముస్తాబవుతున్నారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల గ్రామంలో భక్తిశ్రద్ధలతో మండమెలిగే పండుగను నిర్వహించారు. సమ్మక్క తల్లి భర్త అయిన పగిడిద్దరాజు ఇక్కడి నుంచి కాలిబాటన నడిచి మేడారం వెల్తేనే అక్కడ.. మహా జాతర ప్రారంభం అవుతుంది.
Similar News
News February 14, 2026
తారిఖ్ ప్రమాణస్వీకారం.. మోదీకి ఆహ్వానం?

బంగ్లాదేశ్ ఎన్నికల్లో విజయం సాధించిన BNP ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. ఆ పార్టీ చీఫ్ తారిఖ్ రెహ్మాన్ PMగా ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి IND ప్రధాని మోదీని ఆహ్వానించాలని ఆ పార్టీ యోచిస్తోంది. ఇదే జరిగితే ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలలో కీలక మలుపుకానుంది. ఇప్పటికే మోదీ సైతం తారిఖ్‌కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కాగా యూనస్ ప్రభుత్వంలో INDతో రిలేషన్స్ దిగజారిన విషయం తెలిసిందే.
News February 14, 2026
తలకిందులుగా ఉండే ఆలయం.. రాణీ కీ వావ్

ప్రపంచంలో తలకిందులుగా ఉండే ఏకైక ఆలయం భారతదేశంలో ఉందని మీకు తెలుసా. అదే గుజరాత్‌లోని రాణి కి వావ్ మెట్ల బావి. నీటినే దైవంగా భావించి చాళుక్య రాజవంశానికి చెందిన రాణి ఉదయమతి తన భర్త భీమ్‌దేవ్ జ్ఞాపకార్థం 1063లో నిర్మించింది. ఈ స్టెప్‌వెల్‌ను క్వీన్స్ స్టెప్‌వెల్ అని పిలుస్తారు. 1980లో ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తవ్వకాల్లో బయటపడిన ఈ బావి 2014లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ జాబితాలో చేరింది.
News February 14, 2026
ధురంధర్‌లో అక్షయ్ ఖన్నా రోల్ ఆఫర్.. నాగార్జున క్లారిటీ

బాక్సాఫీస్ వద్ద రూ.వందల కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టిన ధురంధర్‌లో అక్షయ్ ఖన్నా పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. కాగా ఈ పాత్రలో నటించాలని మేకర్స్ తొలుత నాగార్జునను అడిగారని, డేట్స్ అడ్జస్ట్ కాక తిరస్కరించినట్లు వార్తలొచ్చాయి. తాజాగా దీనిపై నాగ్ స్పందిస్తూ ఈ క్యారెక్టర్ గురించి తనకెలాంటి ఆఫర్ రాలేదని క్లారిటీ ఇచ్చారు. అక్షయ్ ఖన్నా నటన అద్భుతమని, అలాంటి పాత్రలో నటించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.


