News April 27, 2024

ADB: ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి

image

మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాదులోని దుర్గాబాయి దేశ్ముఖ్ గవర్నమెంట్ ఉమెన్స్ టెక్నికల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో ప్రవేశాలకు అర్హులైన అనాథ, నిస్సహాయులైన జిల్లాకు చెందిన పదవ తరగతి ఉత్తీర్ణులైన బాలికలు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా బాలల పరిరక్షణ అధికారి రాజేంద్రప్రసాద్ తెలిపారు. మే 25వ లోగా దరఖాస్తులను ఆదిలాబాద్ బాలరక్షక్ భవన్‌లో అందించాలని కోరారు. వివరాలకు 9440289825 సంప్రదించాలన్నారు.

Similar News

News February 5, 2026

ADB: అభ్యర్థులు ఖర్చు పెట్టేముందుకు జాగ్రత్త..!

image

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఖర్చులకు తగ్గ వివరాలను సమర్పించాల్సి ఉంటుందని, వాటి గురించి తెలుసుకోవాలని ఎన్నికల జిల్లా అబ్జర్వర్ హన్మంత్ నాయక్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నిబంధనల గురించి తెలుసుకోవాలని సూచించారు. తమకు ఎన్నికల కమిషన్ విధించిన లక్ష లోపే ఖర్చులు చేయాలన్నారు. ఖర్చులు ఎక్కువైతే గెలిచిన తరువాత కూడా డిస్ క్వాలిఫై అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు.

News February 5, 2026

ADB: రెబల్స్‌గా పోటీ.. ఒకే వేదికపై నలుగురు

image

మున్సిపల్ ఎన్నికల వేళా ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కంది శ్రీనివాస్ రెడ్డిపై రెబల్స్‌గా పోటీచేసిన నాయకులు సాజిద్ ఖాన్, సుజాత, శ్రీకాంత్ రెడ్డి ఇప్పుడు ఒకే వేదికపై కనిపించడం ఆశ్చర్యానికి గురిచేసింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కాంగ్రెస్ అభ్యర్ధి తరఫున వారందరు ఒకే బృందంగా కలిసి ప్రచారం చేశారు.