News January 22, 2026
AI ప్రయోజనాలు అందరికీ అందాలి: చంద్రబాబు

ప్రభుత్వ సేవలను మెరుగు పరిచేందుకు AIని వినియోగిస్తున్నట్లు CM చంద్రబాబు పేర్కొన్నారు. దావోస్‌లో AIపై నిర్వహించిన సెషన్‌లో ప్రసంగించారు. ‘AI కేవలం టెక్ కంపెనీలు, సిటీలకే పరిమితం కాకుడదు. ప్రతి పౌరుడు, రైతులు, విద్యార్థులు, ఎంటర్‌పెన్యూర్స్ అందరికీ దాని బెనిఫిట్స్ దక్కాలి’ అని తెలిపారు. మరో సెషన్‌లో రాష్ట్రంలో న్యాచురల్ ఫార్మింగ్ కోసం 20లక్షల ఎకరాలు, 18లక్షల మంది రైతులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
Similar News
News March 19, 2026
ధురంధర్-2.. ప్రీమియర్స్‌తోనే రూ.75 కోట్లు

రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్-2 మూవీ చరిత్ర సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్స్ ద్వారానే అత్యధిక వసూళ్లు(₹75Cr) సాధించిన భారత చిత్రంగా నిలిచినట్లు నేషనల్ మీడియా వెల్లడించింది. INDలోనే ₹52.50Cr(గ్రాస్) వచ్చినట్లు పేర్కొంది. ఓవర్సీస్‌లో ప్రీమియర్స్‌తోనే హయ్యెస్ట్ కలెక్షన్లు($2.5M) సాధించిన ఇండియన్ సినిమాగానూ నిలిచినట్లు వివరించింది. ఈ క్రమంలో OG(₹25Cr), యానిమల్($1.2M)ను వెనక్కి నెట్టింది.
News March 19, 2026
సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన CBN, జగన్

AP: నిత్యం ఒకే తరహా డ్రెస్సులో కనిపించే CM చంద్రబాబు, మాజీ CM జగన్ ఉగాది వేళ సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. పంచె కట్టుకొని, భుజంపై కండువా వేసుకొని తెలుగుదనం ఉట్టిపడేలా కనిపించారు. ఇలా కొత్త దుస్తుల్లో వారిని చూసిన అభిమానులు, ఆయా పార్టీల కార్యకర్తలు SMలో ఫొటోలు షేర్ చేస్తున్నారు. తమ అభిమాన నేతల ఫొటోలను పోస్టులు పెడుతూ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సీఎం, మాజీ సీఎంల లుక్ మీకెలా అనిపించింది?
News March 19, 2026
పదవీకాలాన్ని పొడిగించండి.. BCCIకి అగార్కర్ విజ్ఞప్తి

టీమ్ ఇండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పదవీ కాలం వచ్చే జూన్‌తో ముగియనుంది. దీంతో 2027 ODI WC వరకు అవకాశం కల్పించాలని ఆయన BCCIని కోరినట్లు సమాచారం. దీనిపై బోర్డు తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. అగార్కర్ 2023 నుంచి చీఫ్ సెలక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. 2025తో గడువు ముగియగా మరో ఏడాది పొడిగింపు లభించింది. ఈయన హయాంలో భారత్ T20WC-2024, 2026, CT-2025 గెలిచిన విషయం తెలిసిందే.


