News January 22, 2026
వసంత పంచమి.. విద్యార్థులకు సువర్ణవకాశం!

వసంత పంచమి రోజున విజయవాడ దుర్గమ్మ సరస్వతీ దేవిగా దర్శనమిస్తారు. ఈ సందర్భంగా స్కూల్ యూనిఫాం, ఐడీ కార్డుతో వచ్చే విద్యార్థులకు ఉచిత దర్శనం కల్పించనున్నారు. అలాగే పెన్ను, శక్తి కంకణం, అమ్మవారి ఫొటో, లడ్డూ ప్రసాదం ఉచితంగా అందజేయనున్నారు. మహామండపంలో ఉత్సవమూర్తికి పూజలు, యాగశాలలో సరస్వతీ హోమం నిర్వహిస్తారు. విద్యార్థులు తమ పుస్తకాలు, పెన్నులు పూజలో ఉంచి అమ్మవారిని దర్శించుకోవాలని అధికారులు తెలిపారు.
Similar News
News February 20, 2026
22A నిషేధిత భూములపై మంత్రి కీలక ప్రకటన

AP: రాష్ట్రంలో 22A నిషేధిత భూముల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ అసెంబ్లీలో తెలిపారు. ఆ జాబితా నుంచి ప్రైవేటు భూములను తొలగించే అధికారం RDOలకు అప్పగిస్తామన్నారు. భూమిని 22Aలో చేర్చాలంటే ఆ పట్టాదారునికి రిజిస్టర్డ్ పోస్టు/eKYC ద్వారా నోటీసు తప్పనిసరిగా ఇవ్వాలని పేర్కొన్నారు. పదేళ్ల కిందట అసైన్డ్ చేసిన ఇంటి స్థలాలకు పూర్తి హక్కులు కల్పించబోతున్నామని చెప్పారు.
News February 20, 2026
AI SUMMIT: రాహుల్ విమర్శ.. థరూర్ ప్రశంస!

కాంగ్రెస్‌లో ఎవరి దారి వారిదేనని మరోసారి నిరూపితమైంది. AI సమ్మిట్ లోపాలతో మోదీ ప్రభుత్వం ప్రపంచ దేశాల ముందు భారత్‌ను నవ్వులపాలు చేసిందని రాహుల్ మండిపడటం తెలిసిందే. అయితే అందుకు భిన్నంగా సమ్మిట్ బాగా జరిగిందని INC MP థరూర్ పొగిడారు. కొన్ని లోపాలు సహజమన్నారు. గతంలోనూ థరూర్ NDA ప్రభుత్వాన్ని మెచ్చుకోగా పార్టీ ఆయన్ను దూరం పెట్టింది. ఇటీవలే అవి సమసి ఆయనకు కేరళ ఎన్నికల బాధ్యతలను అప్పగించింది.
News February 20, 2026
గ్లోబల్ ఈవెంట్‌లో నిరసనలపై విమర్శలు.. మీరేమంటారు?

ఢిల్లీలో జరుగుతోన్న AI సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ శ్రేణుల నిరసనలపై విమర్శలు వస్తున్నాయి. రాజకీయ ప్రదర్శనలకు ఎన్నో వేదికలు ఉన్నాయని, గ్లోబల్ ఈవెంట్‌లో ఇలా చేయడం సరికాదని పలువురు పేర్కొంటున్నారు. దేశాధినేతలు హాజరైన సదస్సులో చొక్కాలువిప్పి <<19192072>>ఆందోళనలు<<>> చేయడం దేశానికి అప్రతిష్ఠను కలిగిస్తాయని చెబుతున్నారు. అయితే ఏర్పాట్లలో లోపాలతో కేంద్రమే పరువు తీసిందని INC అభిమానులు కౌంటరిస్తున్నారు. మీరేమంటారు?


