News January 22, 2026
వసంత పంచమి ఎందుకు జరుపుకొంటారు?

జ్ఞానానికి అధిదేవత అయిన సరస్వతీ దేవి మాఘ శుక్ల పంచమి నాడు జన్మించినట్లు పురాణాల వాక్కు. ఆ రోజునే వసంతి పంచమిగా జరుపుకొంటాం. బ్రహ్మదేవుడు సృష్టిలో భాగంగా లోకానికి వాక్కును, చైతన్యాన్ని ప్రసాదించడానికి అమ్మవారిని ఆవిర్భవించారు. అందుకే ఈ రోజును ‘శ్రీ పంచమి’, ‘వాగీశ్వరి జయంతి’గా కూడా పిలుస్తారు. వసంత కాలం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అజ్ఞానమనే చీకటిని తొలగించి, జ్ఞానమనే వెలుగులను నింపే పండుగ ఇది.
Similar News
News February 26, 2026
బొప్పాయిలో రింగ్ స్పాట్ వైరస్ – లక్షణాలు

రింగ్ స్పాట్ వైరస్ సోకిన బొప్పాయి చెట్ల లేత ఆకులు పసుపు పచ్చగా మారతాయి. ఆకుల ఈనెలు ముడుచుకుపోతాయి. పూత, పిందె, కాయ, పండ్లపై గోధుమ రంగులో ఉంగరాల్లాంటి రింగుల మచ్చలు ఏర్పడతాయి. ఆ రింగు మధ్య బాగం ఆకుపచ్చగా ఉంటుంది. తెగులు సోకిన పూలు.. పిందెగా మారవు. పిందెలు ఎదగవు. కాయలు తొందరగా పండిపోయి మెత్తగా మారి నీరు కారినట్లు అవుతాయి. ఈ మచ్చల వల్ల పండ్లు నాణ్యత కోల్పోయి మార్కెట్‌లో పంటకు సరైన ధర దక్కదు.
News February 26, 2026
BELలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<
News February 26, 2026
అక్రమ సంపాదన కోసం భూదాన్ భూములపై కన్ను: KTR

TG: దేశంలో అప్పుడు ఒరిజినల్ గాంధీ ఉండేవారని, ఇప్పుడు డూప్లికేట్ గాంధీలు ఉన్నారని మాజీ మంత్రి KTR విమర్శించారు. ‘ఖమ్మం జిల్లాలో ఇళ్ల కూల్చివేత పాపం ముగ్గురు మంత్రులదే. అక్రమ సంపాదన కోసం భూదాన్ భూములపై కన్నేశారు. జిల్లా మంత్రులు మాయగాళ్లు.. చిచ్చుపెడుతున్నారు. పేదలకు ఇళ్లు కట్టించకపోగా ఇళ్లను కూల్చివేయడమేనా ఇందిరమ్మ రాజ్యం? మా ప్రభుత్వం వచ్చాక ఇదే స్థలంలో పేదలకు ఇళ్లు కట్టిస్తాం’ అని తెలిపారు.


