News January 22, 2026

పాజిటివ్‌ థింకింగ్‌ ఎలా ప్రాక్టీస్‌ చేయాలంటే?

image

ఎప్పుడైనా ప్రతికూల ఆలోచనలు వెంబడిస్తుంటే, అందుకు రివర్స్‌లో.. ‘అలా జరగదు.. ఇలా జరుగుతుంది.. అలా కాదు.. ఇలా అవుతుంది’ అని మనసులోనే మాటలు అల్లుకోవాలి. కృతజ్ఞతా భావాన్ని పెంచాలి. ఒక మనిషితో ఎలా మాట్లాడతామో, మనసుతో కూడా అలానే మాట్లాడుకోగలగాలి. ఆ చర్చ, ఆ ఆలోచన పరిష్కారం దిశగా ఉండాలి. నిద్రలేచిన వెంటనే మంచి ఆలోచనలతో రోజును ప్రారంభించాలి. ఏ చిన్న విజయాన్నైనా సెలబ్రేట్ చేసుకోండి.

Similar News

News April 5, 2026

ట్రంప్‌కు పిచ్చి పట్టిందా?

image

‘హార్ముజ్‌ను కంట్రోల్‌లోకి తీసుకోవడం మాకో లెక్క కాదు. రెండు నిమిషాల పని’ అని 6 రోజుల క్రితం ట్రంప్ ప్రగల్భాలు పలికారు. ఇప్పుడేమో మంగళవారం లోపు దాన్ని తెరవాలని ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు బా*ర్డ్స్ అంటూ చిల్లర భాష మాట్లాడారు. దీంతో ట్రంప్ మెదడు పని చేస్తోందా? అని నెటిజన్లు ఫైరవుతున్నారు. యుద్ధాన్ని ఎలా ముగించాలో తెలియక పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు.

News April 5, 2026

ALERT: 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు

image

AP: రాష్ట్రంలో 2 రోజులు భిన్న వాతావరణ పరిస్థితులుంటాయని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో., ప.గో. జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి-మోస్తరు వానలు పడతాయని పేర్కొంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురవొచ్చని చెప్పింది. ఇవాళ 66 మండలాల్లో 40డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, కొన్నిజిల్లాల్లో ఎండలు తీవ్రంగా ఉంటాయని తెలిపింది.

News April 5, 2026

RARE: ఒకే పోలికతో నలుగురు పిల్లల జననం

image

రష్యాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ఒకే పోలికతో ఉన్న నలుగురు పిల్లల(quadruplets)కు మహిళ జన్మనిచ్చింది. వారంతా అమ్మాయిలే కావడం గమనార్హం. 1.55 కోట్ల మందిలో ఒకరికి ఇలా జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరోవైపు రష్యాలో ఇలా జరగడం తొలిసారని తెలుస్తోంది.