News January 22, 2026
అరసవెల్లి రథసప్తమి ఉత్సవాలలో నేటి కార్యక్రమాలు.!

అరసవెల్లిలో సప్తాహ్ ఉత్సవాల్లో భాగంగా నేడు వివిధ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అరసవెల్లి ఆలయంలో ఉత్సవ మూర్తులకు లక్ష పుష్పార్చన సేవ జరగనుంది. డచ్ బంగ్లా వద్ద ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు హెలీ రైడ్, బెలూన్ రైడ్లు ఏర్పాటు చేశారు. కేఆర్ స్టేడియంలో సాయంత్రం ఫుడ్ ఎగ్జిబిషన్, కిడ్స్ ప్లే, నృత్యాలు, మిమిక్రీ, గోరటి వెంకన్న కార్యక్రమంల ‘శ్రీనివాస కళ్యాణం’నాటిక జరుగుతుంది.
Similar News
News February 4, 2026
శ్రీకాకుళం: గుర్తుతెలియని వ్యక్తి మృతి

శ్రీకాకుళంలోని బలగ మెట్టు వద్ద మంగళవారం గుర్తుతెలియని యాచకుడు మృతి చెందారు. పోలీసుల వివరాల మేరకు.. స్థానికంగా చిత్తుకాగితాలు ఏరుకుని భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న వ్యక్తి మద్యానికి బానిస అయ్యాడు. ఈ మేరకు బలగ మెత్తులోని ఒక ఆలయం వద్ద అస్వస్థతకు గురై మృతిచెందాడు. ఈ మేరకు మృతదేహాన్ని శ్రీకాకుళం 2టౌన్ పోలీసులు పరిశీలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 4, 2026
SKLM: నేడు జిల్లా పోలీస్ స్పోర్ట్స్ మీట్

శ్రీకాకుళం పోలీస్ అధికారులకు సంబంధించి వార్షిక జిల్లాస్థాయి స్పోర్ట్స్ గేమ్స్ కార్యక్రమం ఈనెల 4న శ్రీకాకుళం మండలం తండేవలస పోలీస్ శిక్షణ కేంద్రం గ్రౌండ్లో నిర్వహించనున్నట్లు ఎస్పీ కేవీ.మహేశ్వర్ రెడ్డి మంగళవారం తెలిపారు. పోలీస్ సిబ్బంది శారీరక దృఢత్వాన్ని క్రీడా స్ఫూర్తిని ప్రోత్సహించేందుకు ఈ క్రీడలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ముఖ్యఅతిథిగా రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి పాల్గొంటారన్నారు.
News February 3, 2026
శ్రీముఖలింగం: శివరాత్రి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష

జలుమూరు మండలం శ్రీముఖలింగేశ్వరుని క్షేత్రంలో శివరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా జిల్లా అధికారులతో నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సమీక్షించారు. మంగళవారం మధ్యాహ్నం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయానికి వెళ్లిన ఆయన కలెక్టర్ స్వప్నిల్ దినకర్‌తో పాటు దేవాదాయ శాఖ అధికారులతో ఏర్పాట్లపై చర్చించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.


