News January 22, 2026

ట్రంప్ ఎఫెక్ట్.. భారీ లాభాల్లో మార్కెట్లు

image

యూరప్ దేశాలపై టారిఫ్‌ల విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గడంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్ 649 పాయింట్లు ఎగబాకి 82,559 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 196 పాయింట్లు పెరిగి 25,372 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్-30 సూచీలో అన్ని షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఎటర్నల్, ఏషియన్ పెయింట్స్, SBI, అదానీ పోర్ట్స్, BEL షేర్లు లాభాల్లో ఉన్నాయి.

Similar News

News February 18, 2026

చంద్రబాబు వదిలిపెట్టరనే భయంతోనే ఆత్మహత్యలు: TDP

image

AP: మదనపల్లెలో చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు కులవర్ధన్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో SMలో TDP ఆసక్తికర పోస్ట్ పెట్టింది. 2018 దాచేపల్లి నుంచి నేటి మదనపల్లె ఘటన వరకు ఆడబిడ్డల జోలికి వెళ్లిన నిందితులు వరుసగా ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొంది. నేరం చేస్తే చంద్రబాబు వదిలిపెట్టరనే భయమే వారిని వెంటాడిందని, అందుకే ప్రాణాలు తీసుకున్నారని రాసుకొచ్చింది.

News February 18, 2026

T20 ర్యాంకింగ్స్.. టాప్-10లోకి ఇషాన్

image

ఐసీసీ ప్రకటించిన తాజా టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా నుంచి నలుగురు బ్యాటర్లు టాప్-10లో ఉన్నారు. నంబర్ 1 స్థానంలో అభిషేక్ శర్మ కొనసాగుతుండగా తిలక్ 4, సూర్య 6, ఇషాన్ కిషన్ 8వ స్థానాల్లో నిలిచారు. టీ20 WCలో వరుసగా రెండు హాఫ్ సెంచరీలు చేయడంతో ఇషాన్ ర్యాంకింగ్ మెరుగుపడింది. టీ20 ఆల్‌రౌండర్లలో హార్దిక్ 3, దూబే 9వ స్థానంలో, బౌలర్లలో వరుణ్ చక్రవర్తి తొలి స్థానంలో ఉన్నారు.

News February 18, 2026

జుట్టు పొడిబారకుండా ఉండాలంటే?

image

పొడిబారి ఉన్న కురులకు గాఢత తక్కువగా, తేమను పెంచే షాంపూలను ఎంచుకోవాలి. పొడి జుట్టు ఉన్నవారు సల్ఫేట్‌ ఫ్రీ ఫార్ములాతో ఉన్న మాయిశ్చరైజింగ్‌ షాంపూలను ఎంచుకోవాలి. తేమను నిలిపే హైలురోనిక్‌ యాసిడ్, స్క్వాలేన్‌ వంటివి ఉండేలా చూసుకోవాలి. తలస్నానం చేశాక కండిషనర్‌ తప్పనిసరిగా రాసుకోవాలి. అయినా సమస్య తగ్గకపోతే డెర్మటాలజిస్ట్‌ని సంప్రదించి పోషకాల లేమి ఏమైనా ఉంటే… సప్లిమెంట్స్‌ వాడాల్సి ఉంటుంది.